Telugu Global
Cinema & Entertainment

కోటి మందికి సినిమా చూపించింది

అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఆ సినిమా తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా చేశాడు బన్నీ. అది కూడా వచ్చి వెళ్లిపోయింది. కానీ రేసుగుర్రం హవా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో సినిమా చూపిస్త మావ పాట యూట్యూబ్ లో మరో రికార్డు సృష్టించింది. దాదాపు కోటి మంది వీక్షకులు ఇప్పటివరకు ఈ పాటను యూట్యూబ్ లో చూశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక […]

కోటి మందికి సినిమా చూపించింది
X
అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఆ సినిమా తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా చేశాడు బన్నీ. అది కూడా వచ్చి వెళ్లిపోయింది. కానీ రేసుగుర్రం హవా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో సినిమా చూపిస్త మావ పాట యూట్యూబ్ లో మరో రికార్డు సృష్టించింది. దాదాపు కోటి మంది వీక్షకులు ఇప్పటివరకు ఈ పాటను యూట్యూబ్ లో చూశారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇదొక రికార్డు. ఇప్పటివరకు ఏ తెలుగు సాంగ్ ను కోటిమంది ప్రేక్షకులు యూట్యూబ్ లో వీక్షించలేదు. సినిమా చూపిస్త మామ అనే సాంగ్ మాత్రమే ఈ అరుదైన రికార్డు అందుకుంది. ఈ పాటను తమన్ కంపోజ్ చేశాడు. పక్కా ఫోక్ బీట్ తో సాగే ఈ పాట కుర్రాళ్ల నుంచి పెద్దోళ్ల వరకు అందర్నీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా పాటలో బన్నీ, శృతిహాసన్ స్టెప్పులు అదుర్స్. ఇలా అన్నీ కలిసి రావడంతో సినిమా చూపిస్త మామ అనే పాట ఆల్ టైమ్ రికార్డు సొంతం చేసుకుంది.
First Published:  4 Oct 2015 7:05 PM GMT
Next Story