Telugu Global
Cinema & Entertainment

నాగార్జున నయా మూవీ షూటింగ్ పూర్తి

ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలు చేస్తున్నాడు. కార్తితో కలిసి ఊపిరి అనే సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు ద్విపాత్రాభినయం చేస్తూ సోగ్గాడే చిన్నినాయనా అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండింటిలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. మైసూర్ లో జరిగిన షెడ్యూల్ లో ఓ పాట, కొన్ని సాంగ్స్ పిక్చరైజ్ చేయడంతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ 3 వారాల కిందటే ముగియాల్సింది. కానీ కొన్ని సన్నివేశాలు […]

నాగార్జున నయా మూవీ షూటింగ్ పూర్తి
X
ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాలు చేస్తున్నాడు. కార్తితో కలిసి ఊపిరి అనే సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు ద్విపాత్రాభినయం చేస్తూ సోగ్గాడే చిన్నినాయనా అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండింటిలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. మైసూర్ లో జరిగిన షెడ్యూల్ లో ఓ పాట, కొన్ని సాంగ్స్ పిక్చరైజ్ చేయడంతో సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ 3 వారాల కిందటే ముగియాల్సింది. కానీ కొన్ని సన్నివేశాలు నచ్చక, నాగార్జున మళ్లీ రీషూట్ చేయించాడు. అలా 3 వారాలు ఆలస్యంగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కల్యాణ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగార్జున చేస్తున్న రెండు క్యారెక్టర్లలో ఓ పాత్ర.. ఆత్మ పాత్ర కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
First Published:  4 Oct 2015 7:06 PM GMT
Next Story