Telugu Global
Cinema & Entertainment

రవితేజ పండక్కి తేదీ మారింది

ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు మాస్ రాజా. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా, తమన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు మేకర్స్. మరోవైపు సినిమా విడుదల తేదీని, ఆడియో రిలీజ్ తేదీల్ని కూడా ప్రకటించారు. దీపావళి కానుకగా బెంగాల్ టైగర్ ను నవంబర్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆడియో విడుదల తేదీలో మాత్రం మార్పులు చోటుచేసుకున్నాయి. పాటల విడుదల వేడుకను […]

రవితేజ పండక్కి తేదీ మారింది
X
ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు మాస్ రాజా. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా, తమన్న హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్స్ విడుదల చేశారు మేకర్స్. మరోవైపు సినిమా విడుదల తేదీని, ఆడియో రిలీజ్ తేదీల్ని కూడా ప్రకటించారు. దీపావళి కానుకగా బెంగాల్ టైగర్ ను నవంబర్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆడియో విడుదల తేదీలో మాత్రం మార్పులు చోటుచేసుకున్నాయి. పాటల విడుదల వేడుకను ఈనెల 18న సెలబ్రేట్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తేదీని ముందుకు జరిపారు. తాజా సమాచారం ప్రకారం.. బెంగాల్ టైగర్ పాటలు చెప్పిన తేదీకి ఒక రోజు ముందే.. అంటే అక్టోబర్ 17కే మార్కెట్లోకి వచ్చేస్తాయి. అవును.. అక్టోబర్ 18న కాకుండా 17న బెంగాల్ టైగర్ పాటల్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటల వేడుకతో, బెంగాల్ టైగర్ ప్రమోషన్ ను అపీషియల్ గా షురూ చేయాలనుకుంటున్నారు.
Next Story