Telugu Global
Cinema & Entertainment

 ప్రచారం కోసం రుద్రమదేవి నగలు

రుద్రమదేవి సినిమా చిత్రీకరణ కోసం ఒరిజినల్ నగల్నే వాడారు. చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించి మరీ షూటింగ్ లో కిలోల కొద్దీ నగల్ని వాడారు. అప్పట్లో ఆ నగలు చోరీకి గురవ్వడం.. తిరిగి దొరకడం లాంటి విషయాలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు తాజాగా మరోసారి ఆ నగలు తెరపైకొచ్చాయి. రుద్రమదేవి నగలతో వినూత్నంగా ప్రచారం ఇవ్వాలని భావిస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. ఈ మేరకు  ఆ నగల సంస్థతో ఓ ఒప్పందం కూడా చేసుకున్నాడు. తాజా ఒప్పందం ప్రకారం.. […]

 ప్రచారం కోసం రుద్రమదేవి నగలు
X
రుద్రమదేవి సినిమా చిత్రీకరణ కోసం ఒరిజినల్ నగల్నే వాడారు. చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించి మరీ షూటింగ్ లో కిలోల కొద్దీ నగల్ని వాడారు. అప్పట్లో ఆ నగలు చోరీకి గురవ్వడం.. తిరిగి దొరకడం లాంటి విషయాలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు తాజాగా మరోసారి ఆ నగలు తెరపైకొచ్చాయి. రుద్రమదేవి నగలతో వినూత్నంగా ప్రచారం ఇవ్వాలని భావిస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. ఈ మేరకు ఆ నగల సంస్థతో ఓ ఒప్పందం కూడా చేసుకున్నాడు. తాజా ఒప్పందం ప్రకారం.. హీరోయిన్ అనుష్క.. రుద్రమదేవి నగలన్నీ నిండుగా ధరించి చెన్నైలోని సదరు షాపింగ్ మాల్ లో దర్శనమిచ్చింది. త్వరలోనే అవే నగలుతో టాలీవుడ్ లో కూడా ప్రచారం మొదలుపెడుతుంది. సినిమాకు సంబంధించి చిన్నపోటీ ఏర్పాటుచేసి, అందులో గెలిచినవారికి రుద్రమదేవికి సంబంధించిన ఓ నగను కూడా బహుకరించే ఆలోచనలో ఉంది యూనిట్. ఇలా.. నగల్ని కూడా ప్రచారానికి వాడుకుంటా వినూత్నంగా దూసుకుపోతున్నాడు దర్శకుడు గుణశేఖర్.
First Published:  4 Oct 2015 7:02 PM GMT
Next Story