Telugu Global
Cinema & Entertainment

కుమారి 21ఎఫ్ కు స్టార్ సపోర్ట్

రాజ్ తరుణ్ మరోసారి జాక్ పాట్ కొట్టాడు. ఈ చిన్న హీరోకు అనుకోకుండా పెద్ద స్టార్ల సపోర్ట్ దొరుకుతోంది. తొలి సినిమా ఉయ్యాల జంపాలాకు ఏకంగా నాగార్జున రంగంలోకి దిగాడు. ఆ సినిమా ప్రమోషన్ ను తన భుజాన వేసుకున్నాడు. నిజానికి ఆ సినిమా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కింది కాబట్టి.. నాగార్జున ప్రమోట్ చేసుకున్నాడు. అందులో తప్పులేదు. కానీ రాజ్ తరుణ్ నయా సినిమాతో ఏమాత్రం ప్రమేయం లేనప్పటికీ.. మహేష్, ఎన్టీఆర్, రామ్ లాంటి […]

కుమారి 21ఎఫ్ కు స్టార్ సపోర్ట్
X
రాజ్ తరుణ్ మరోసారి జాక్ పాట్ కొట్టాడు. ఈ చిన్న హీరోకు అనుకోకుండా పెద్ద స్టార్ల సపోర్ట్ దొరుకుతోంది. తొలి సినిమా ఉయ్యాల జంపాలాకు ఏకంగా నాగార్జున రంగంలోకి దిగాడు. ఆ సినిమా ప్రమోషన్ ను తన భుజాన వేసుకున్నాడు. నిజానికి ఆ సినిమా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై తెరకెక్కింది కాబట్టి.. నాగార్జున ప్రమోట్ చేసుకున్నాడు. అందులో తప్పులేదు. కానీ రాజ్ తరుణ్ నయా సినిమాతో ఏమాత్రం ప్రమేయం లేనప్పటికీ.. మహేష్, ఎన్టీఆర్, రామ్ లాంటి హీరోలు ప్రమోషన్ షురూ చేశారు. తాజాగా కుమారి 21 ఎఫ్ అనే సినిమా చేశాడు రాజ్ తరుణ్. సుకుమార్ తొలిసారిగా నిర్మిస్తున్న ఈ సినిమాతో హీబా పటేల్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను ఎన్టీఆర్ లాంఛ్ చేశాడు. ఆ టీజర్ బ్రహ్మాండంగా ఉందంటూ మహేష్ ట్వీట్ చేశాడు. మరో హీరో రామ్ అయితే మీడియా ముందే మెచ్చుకున్నాడు. ఇలా స్టార్ గణమంతా రాజ్ తరుణ్ సినిమాకు మంచి ప్రమోషన్ ఇస్తోంది.
Next Story