Telugu Global
Others

కాఫీ ప్రియులూ...క్యారీ ఆన్‌...

కాఫీ, టీ…ఇవి రెండూ మ‌నిషి జీవితంలో ఒక భాగ‌మై పోయినా…ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా…అనే విష‌యంలో మ‌న‌మింకా డైల‌మాలోనే ఉన్నాం. ఇంకా ఈ విష‌యంపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. త‌గు మోతాదులో కాఫీ తాగ‌టం వ‌ల‌న గుండె కొట్టుకునే వేగంలో తేడా కార‌ణంగా ఉత్ప‌న్న‌మ‌య్యే స‌మ‌స్య‌ ఆట్రియ‌ల్ ఫిబ్రిలేష‌న్ వ‌చ్చే ప్ర‌మాదం ఉండ‌బోద‌ని ఇటీవ‌ల ప‌రిశోధ‌కులు తేల్చారు. ఇంత‌కు ముందు కాఫీకి, ఈవ్యాధికి సంబంధం ఉంద‌నే సందేహం ఉండ‌టంతో ఈ ఫ‌లితం కాఫీ ప్రియుల‌కు శుభ‌వార్తేన‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. మ‌రో నాలుగు అధ్య‌య‌నాల తాలూకూ […]

కాఫీ ప్రియులూ...క్యారీ ఆన్‌...
X

కాఫీ, టీ…ఇవి రెండూ మ‌నిషి జీవితంలో ఒక భాగ‌మై పోయినా…ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా…అనే విష‌యంలో మ‌న‌మింకా డైల‌మాలోనే ఉన్నాం. ఇంకా ఈ విష‌యంపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. త‌గు మోతాదులో కాఫీ తాగ‌టం వ‌ల‌న గుండె కొట్టుకునే వేగంలో తేడా కార‌ణంగా ఉత్ప‌న్న‌మ‌య్యే స‌మ‌స్య‌ ఆట్రియ‌ల్ ఫిబ్రిలేష‌న్ వ‌చ్చే ప్ర‌మాదం ఉండ‌బోద‌ని ఇటీవ‌ల ప‌రిశోధ‌కులు తేల్చారు. ఇంత‌కు ముందు కాఫీకి, ఈవ్యాధికి సంబంధం ఉంద‌నే సందేహం ఉండ‌టంతో ఈ ఫ‌లితం కాఫీ ప్రియుల‌కు శుభ‌వార్తేన‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. మ‌రో నాలుగు అధ్య‌య‌నాల తాలూకూ ఫ‌లితాల‌ను సైతం విశ్లేషించి ఈ సంయుక్త ఫ‌లితాన్ని వెలువ‌రించారు.

కాఫీపై జ‌రిగిన ఈ త‌ర‌హా అధ్య‌య‌నాల్లో ఇది అతిపెద్ద అధ్య‌య‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. 12 సంవ‌త్స‌రాల‌పాటు 2 ల‌క్ష‌ల 50వేల‌మందిపై ఈ అధ్య‌య‌నాల‌ను నిర్వ‌హించారు. కాఫీ తాగ‌డానికి, ఆట్రియ‌ల్ ఫిబ్రిలేష‌న్ అనే గుండె స‌మ‌స్య రావ‌డానికి ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో స్వీడ‌న్‌లోని క‌రోలింస్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్ర‌వేత్తలు ఈ ప‌రిశోధ‌న నిర్వ‌హించారు. కాఫీ మోతాదు పెరిగితే ఆట్రియ‌ల్ ఫిబ్రిలేష‌న్ వ‌స్తుంద‌నేందుకు త‌మ‌కు ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేద‌ని వీరు చెబుతున్నారు. క్ర‌మం త‌ప్పిన హార్ట్ బీట్‌తో వ‌చ్చే ఎఎఫ్ అనే ఈ వ్యాధి, త‌రువాత కాలంలో గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర అనారోగ్యాల‌కు కార‌ణ‌మ‌వుతుంది.

First Published:  4 Oct 2015 4:23 AM GMT
Next Story