Telugu Global
CRIME

సినీ నిర్మాత‌పై బెదిరింపుల కేసు

తాను నిర్మిస్తున్న చిత్రంలో షేర్ ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి డ‌బ్బులు తీసుకుని.. బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న ఓ నిర్మాత‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు న‌మోదైంది. ఐశ్వర్య ఆర్ట్ క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత, నిర్మాత శాఖమూరి పాండు రంగారావుకు  కడప జిల్లా వేల్పుల మండలం వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి అనే కాంట్రాక్టర్‌తో ప‌రిచ‌యం ఉంది. తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాన‌ని దాంట్లో పెట్టుబ‌డి పెడితే.. చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామిని చేస్తాన‌ని పాండు రంగారావు న‌మ్మ‌బ‌లికాడు. దీంతో […]

తాను నిర్మిస్తున్న చిత్రంలో షేర్ ఇస్తాన‌ని న‌మ్మ‌బ‌లికి డ‌బ్బులు తీసుకుని.. బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్న ఓ నిర్మాత‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు న‌మోదైంది. ఐశ్వర్య ఆర్ట్ క్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత, నిర్మాత శాఖమూరి పాండు రంగారావుకు కడప జిల్లా వేల్పుల మండలం వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి అనే కాంట్రాక్టర్‌తో ప‌రిచ‌యం ఉంది. తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాన‌ని దాంట్లో పెట్టుబ‌డి పెడితే.. చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామిని చేస్తాన‌ని పాండు రంగారావు న‌మ్మ‌బ‌లికాడు. దీంతో రామలింగారెడ్డి త‌న స్నేహితుల వ‌ద్ద దాదాపు రూ.కోటిన్న‌ర పోగు చేసి పాండు చేతిలో పోశాడు. అన్న‌మాట ప్ర‌కారం.. ఎలాంటి భాగ‌స్వామ్యం క‌ల్పించ‌లేదు. ఇచ్చిన డ‌బ్బులోనూ కేవ‌లం రూ.80 ల‌క్ష‌ల మాత్ర‌మే చెల్లించాడు. మిగిలిన డ‌బ్బులు ఇవ్వ‌కుండా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని రామలింగారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిపై ఐపీసీ 420, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story