Telugu Global
Cinema & Entertainment

ఈ సారికి వర్మ అలా ఫిక్స్ అయ్యాడు...

ప్ర‌చారం అనేది ఒక క‌ళ‌.   అన్ని అందుబాటులో వున్న కొందరు ఏమి చేయ‌లేరు. అస‌లు ఏమి పెద్ద‌గా  ఖ‌ర్చు లేకుండా    ల‌క్ష‌ల ప్ర‌చారం  గెయిన్ చేయ‌డం  అనేది నిజంగా గ్రేట్ ఆర్ట్. ఈ ఆర్ట్ లో ఇండియాలోనే ఆరితేరిన  మేర‌న‌గా మొన‌గాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.  త‌న సినిమాల‌కు ప‌బ్లిసిటి చేయ‌డంలో  వ‌ర్మ    ఎటువంటి ఎత్తుగడులు వేస్తారో  ఎవ‌రికి అర్ధం కాదు.    ఇక ప్ర‌స్తుతం  సినిమాల‌కంటే సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో బిజీగా వున్న రామ్ గోపాల్ […]

ఈ సారికి వర్మ అలా ఫిక్స్ అయ్యాడు...
X

ప్ర‌చారం అనేది ఒక క‌ళ‌. అన్ని అందుబాటులో వున్న కొందరు ఏమి చేయ‌లేరు. అస‌లు ఏమి పెద్ద‌గా ఖ‌ర్చు లేకుండా ల‌క్ష‌ల ప్ర‌చారం గెయిన్ చేయ‌డం అనేది నిజంగా గ్రేట్ ఆర్ట్. ఈ ఆర్ట్ లో ఇండియాలోనే ఆరితేరిన మేర‌న‌గా మొన‌గాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. త‌న సినిమాల‌కు ప‌బ్లిసిటి చేయ‌డంలో వ‌ర్మ ఎటువంటి ఎత్తుగడులు వేస్తారో ఎవ‌రికి అర్ధం కాదు. ఇక ప్ర‌స్తుతం సినిమాల‌కంటే సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో బిజీగా వున్న రామ్ గోపాల్ వ‌ర్మ‌.. బ్రుస్లీ అనే అస్త్రాని గ‌ట్టిగా ఫోక‌స్ చేశారు.

ప్ర‌స్తుతం వ‌ర్మసినిమాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గింది .అయితే అవేమి ఆయ‌న‌కు అవ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య సినిమాల‌కు కాస్త దూరంగా వున్న వ‌ర్మ‌…త‌న‌కు బ్రుసీలీ మీద ఉన్న అభిమానాని వ్య‌క్త ప‌రుస్తు వ‌చ్చారు. రెండు మూడు సంవ‌త్స‌రాల నుంచి మార్ష‌ల్ ఆర్ట్స్ యోధుడు బ్రుసిలీ జీవితం గురించి ఒక సినిమా చేయాల‌నే చెబుతున్నారు. ఇక రాంచ‌ర‌ణ్ హీరోగా వ‌స్తున్న బ్రుస్ లీ సినిమా రిలీజ్ కు సిద్దం అవుతున్న స‌మ‌యంలో.. వ‌ర్మ సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో త‌ను చేయ‌బోయో బ్రుస్లీ సినిమా ఫ‌స్ట్ లుక్ అన్న‌ట్లు ఒక పోస్ట‌ర్ వ‌దిలారు. ఈ చిత్రం సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఒక లేడి ఫైట‌ర్ ఒక మార్ష‌ల్ ఆర్ట్స్ స్టిల్ లో ఉన్న పిక్చ‌ర్ ను పోస్ట్ చేశారు. బ్రుస్లీ జీవితం త‌న‌ను ఎంత‌గానో ప్ర‌భావితం చేసింది అని త‌రుచు చెప్పే మ‌న క్రియేటివి జీనియ‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ బ్రుసీలి లైఫ్ ప్రేర‌ణ తో ఏ త‌ర‌హా చిత్రం అభిమానుల‌కు అందిస్తారో..లెట్స్ వెయింట్ అండ్ సీ. అన్న‌ట్లు మ‌న వ‌ర్మ స్టూడెంట్ గా వున్న‌ప్పుడు క‌రాటేలో బ్లాక్ బెల్ట్ అండోయ్ !.

Next Story