Telugu Global
CRIME

వేటాడి... వెంటాడి ఇనుపరాడ్డుతో హత్య

తమపై ఫిర్యాదు చేశాడనే కోపంతో రౌడీ మూకలు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రౌడీ గ్యాంగ్‌ ఆగడాలపై సోహెల్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఆగ్రహంతో సోహెల్‌ వెంట పడ్డారు. టూ వీలర్‌పై వెళుతున్న సోహెల్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటాడడం మానలేదు. దీంతో వీరి నుంచి తప్పించుకునేందుకు వీలుగా సమీపంలో ఉన్న ఓ హోటల్‌లోకి పరిగెత్తాడు. అయినా రౌడీ గ్యాంగ్‌ వెంటాడి […]

తమపై ఫిర్యాదు చేశాడనే కోపంతో రౌడీ మూకలు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. రౌడీ గ్యాంగ్‌ ఆగడాలపై సోహెల్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఆగ్రహంతో సోహెల్‌ వెంట పడ్డారు. టూ వీలర్‌పై వెళుతున్న సోహెల్‌ తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటాడడం మానలేదు. దీంతో వీరి నుంచి తప్పించుకునేందుకు వీలుగా సమీపంలో ఉన్న ఓ హోటల్‌లోకి పరిగెత్తాడు. అయినా రౌడీ గ్యాంగ్‌ వెంటాడి హోటల్‌లోకి వెళ్ళి ఇనుప రాడ్డుతో అతనిపై దాడి చేసింది. ఈ సంఘటనలో సోహల్‌ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్యోదంతం అంతా హోటల్‌లోని సీసీ కెమెరాలకు చిక్కింది. ఈ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నడిరోడ్డు మీద ఇలా వేటాడి హత్యకు పాల్పడడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

First Published:  2 Oct 2015 3:06 PM GMT
Next Story