Telugu Global
Others

శంకుస్థాపన ముహూర్తం బాగోలేదా?

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వాస్తు, జ్యోతిష్య పండితుల అభిప్రాయాలకు మధ్య పొత్తు కుదరడం లేదు. తాజాగా ఈనెల 22న జరగాల్సిన అమరావతి శంకుస్థాపనకు ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తంపై కొందరు వాస్తు, జ్యోతిష్య పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొండిగా ముందుకెళ్తే జరిగే పరిణామాలపైనా వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయదశమి అయిన ఈనెల 22న మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలను రాజధాని శంకుస్థాపనకు ముహూర్తంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వాస్తు విజ్ఞాన పరిషత్ […]

శంకుస్థాపన ముహూర్తం బాగోలేదా?
X

ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వాస్తు, జ్యోతిష్య పండితుల అభిప్రాయాలకు మధ్య పొత్తు కుదరడం లేదు. తాజాగా ఈనెల 22న జరగాల్సిన అమరావతి శంకుస్థాపనకు ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తంపై కొందరు వాస్తు, జ్యోతిష్య పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొండిగా ముందుకెళ్తే జరిగే పరిణామాలపైనా వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

విజయదశమి అయిన ఈనెల 22న మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలను రాజధాని శంకుస్థాపనకు ముహూర్తంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వాస్తు విజ్ఞాన పరిషత్ కార్యదర్శి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పల్లవాహుల శ్రీరామకృష్ణ శర్మ తప్పుపట్టారు. ఈనెల 22 మధ్నాహ్నం 12. 45 గంటల సమయం శంకుస్తాపనకు సరైంది కాదని… దాని స్థానంలో అదే రోజు ఉదయం 11 గంటల 39 నిమిషాలకు కార్యక్రమం నిర్వహిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం స్థిరత్వానికి సరైనది కాదంటున్నారు.

రాజధాని శంకుస్థాపన అంటే అదో మహాకార్యమని అలాంటి కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సరికాదని విజయవాడకు చెందిన జ్యోతిష్య పండితులు పులిపాక చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఎవరో ఒక వ్యక్తి పెట్టిన ముహూర్తాన్ని గుడ్డిగా నమ్మి ముందుకెళ్లడం సరికాదంటున్నారు పండితులు. ప్రభుత్వం జ్యోతిష్య పండితులను పిలిపించి సమగ్రంగా చర్చించి ముందుకెళ్లాలని సూచించారు.

అయితే ఏ మూహూర్తాన్ని నిర్ణయించినా కొందరు సమర్థించడం , కొందరు వ్యతిరేకించడం ఈ మధ్య పదేపదే చర్చనీయాంశమవుతోంది. ఒక శుఖకార్యానికి శ్రీకారం చుట్టే ముందు ఇలాంటి అనుమానులు రేపడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  3 Oct 2015 3:18 AM GMT
Next Story