Telugu Global
Cinema & Entertainment

డ్యూయల్ రోల్  లో బాలయ్య

తెలుగులో బాలకృష్ణ చేసినన్ని డ్యూయల్ రోల్ పాత్రలు మరో హీరో చేయలేదు. ఇండస్ట్రీలో ఇదొక రికార్డు కూడా. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. ఇలా ఏ ఒక్క సీనియర్ హీరో బాలయ్య చేసినన్ని డ్యూయల్ రోల్స్ లేదు. తాజా చిత్రానికి కూడా నటసింహం ఇదే పంథాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం తన 99వ సినిమా డిక్టేటర్ లో కూడా బాలయ్య డబుల్ రోల్ లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు డిక్టేటర్ సినిమాకు సంబంధించి ఎన్నో […]

డ్యూయల్ రోల్  లో బాలయ్య
X
తెలుగులో బాలకృష్ణ చేసినన్ని డ్యూయల్ రోల్ పాత్రలు మరో హీరో చేయలేదు. ఇండస్ట్రీలో ఇదొక రికార్డు కూడా. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. ఇలా ఏ ఒక్క సీనియర్ హీరో బాలయ్య చేసినన్ని డ్యూయల్ రోల్స్ లేదు. తాజా చిత్రానికి కూడా నటసింహం ఇదే పంథాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం తన 99వ సినిమా డిక్టేటర్ లో కూడా బాలయ్య డబుల్ రోల్ లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు డిక్టేటర్ సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలు బయటకొచ్చాయి. కానీ ఆ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపిస్తారనే వార్త మాత్రం పూర్తిగా కొత్తది. ఈ విషయాన్ని ఇటు దర్శకుడుకానీ, అటు బాలయ్య కానీ ఎవరూ కన్ ఫర్మ్ చేయడం లేదు. సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ నాటికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి, సంక్రాంతి కానుకగా డిక్టేటర్ ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మరోవైపు బాలయ్య తన వందో సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ ఎప్పట్నుంచో నడుస్తోంది.
First Published:  2 Oct 2015 7:07 PM GMT
Next Story