Telugu Global
CRIME

పోలీస్ అధికారులను బంధించిన ఐపీఎస్ భార్య

భర్త సీనియర్ ఐపీఎస్ అన్న పొగరుతో గుజరాత్‌లో ఓ మహిళ రెచ్చిపోయింది. ఏకంగా పోలీస్ అధికారులనే బంధించింది అందరూ అవాక్కయ్యేలా చేసింది. తాను చెప్పినదానికల్లా తలూపలేదన్న కోపంతో 17 మంది పోలీస్ సిబ్బందిని బంధించింది. వారిలో 12 మంది ఏఎస్‌ఐలు కూడా ఉన్నారు. అడిషినల్ డీజీ విపుల్ బిజోయ్ భార్య ఈ ఘనకార్యం చేశారు. 17 మందిని తన గ్యారేజ్‌లో బంధించింది. బుధవారం రాత్రంతా వారిని అలాగే ఉంచేసింది. తినేందుకు తిండి లేదు. తాగేందుకు నీరు లేవు. […]

పోలీస్ అధికారులను బంధించిన ఐపీఎస్ భార్య
X

భర్త సీనియర్ ఐపీఎస్ అన్న పొగరుతో గుజరాత్‌లో ఓ మహిళ రెచ్చిపోయింది. ఏకంగా పోలీస్ అధికారులనే బంధించింది అందరూ అవాక్కయ్యేలా చేసింది.

తాను చెప్పినదానికల్లా తలూపలేదన్న కోపంతో 17 మంది పోలీస్ సిబ్బందిని బంధించింది. వారిలో 12 మంది ఏఎస్‌ఐలు కూడా ఉన్నారు. అడిషినల్ డీజీ విపుల్ బిజోయ్ భార్య ఈ ఘనకార్యం చేశారు. 17 మందిని తన గ్యారేజ్‌లో బంధించింది. బుధవారం రాత్రంతా వారిని అలాగే ఉంచేసింది. తినేందుకు తిండి లేదు. తాగేందుకు నీరు లేవు. రాత్రంతా పోలీసులు బిక్కమొహాలేసుకుని బిక్కుబిక్కుమంటూ బతికేశారు. గ్యారేజ్‌లో కనీసం టాయిలెట్‌ కూడా లేదు. మేడమ్ గారి శాడిజం చూసి బంధీలుగా ఉన్న పోలీసులు భయపడిపోయారు. బంధీలుగా ఉన్న తమను ఎప్పుడు వచ్చి ఏంచేస్తుందోనని రాత్రంతా నిద్రపోకుండా తమకు తాము కాపలా కాసుకున్నారు.

విషయం తెలుసుకున్నపోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లి వారిని విడిపించారు. . ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. విపుల్ కుటుంబం పోలీస్ ట్రైనింగ్ అకాడమీ అవరణలోనే ఉన్న బంగ్లాలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఈ ఘటన జరిగింది.

Next Story