Telugu Global
Cinema & Entertainment

విక్ర‌మ్  ను నిలబెడుతుందా..!

ప్ర‌తి హీరో కెరీర్ లోను ఎత్తు ప‌ల్లాలుంటాయి.  అంగ‌ట్లో అన్ని వున్నా ..అల్లుడు నోట్లో శ‌ని అన్న‌చందంగా ఉంది  హీరో విక్ర‌మ్ ప‌రిస్థితి.  త‌న కెరీర్ లో  హిట్ అవ‌స‌ర‌మైన  సంద‌ర్భంలో    ..హీరో శంక‌ర్ తో   క‌ల‌సి  దాదాపు మూడు సంవ‌త్స‌రాలు పాటు డేట్స్ కేటాయించి.. త‌న శ‌రీరం పై ప్రయోగాలు చేసుకుని ..  ఐ చిత్రంతో   అభిమానుల ముందుకు వ‌చ్చాడు.  చివ‌ర‌కు ఈసినిమా రిజ‌ల్ట్..  ఆప‌రేష‌న్ స‌క్సెస్ కానీ..  పేషెంట్ ఈజ్ ఇన్ డేంజ‌ర్ అనే […]

విక్ర‌మ్  ను నిలబెడుతుందా..!
X

ప్ర‌తి హీరో కెరీర్ లోను ఎత్తు ప‌ల్లాలుంటాయి. అంగ‌ట్లో అన్ని వున్నా ..అల్లుడు నోట్లో శ‌ని అన్న‌చందంగా ఉంది హీరో విక్ర‌మ్ ప‌రిస్థితి. త‌న కెరీర్ లో హిట్ అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ..హీరో శంక‌ర్ తో క‌ల‌సి దాదాపు మూడు సంవ‌త్స‌రాలు పాటు డేట్స్ కేటాయించి.. త‌న శ‌రీరం పై ప్రయోగాలు చేసుకుని .. ఐ చిత్రంతో అభిమానుల ముందుకు వ‌చ్చాడు. చివ‌ర‌కు ఈసినిమా రిజ‌ల్ట్.. ఆప‌రేష‌న్ స‌క్సెస్ కానీ.. పేషెంట్ ఈజ్ ఇన్ డేంజ‌ర్ అనే చందంగా వ‌చ్చింది. ఇది కెరీర్ ప‌రంగా విక్ర‌మ్ కు చాల పెద్ద దెబ్బ ప‌డిన‌ట్లే అని చెప్పాలి. ఎందుకంటే.. 5 ప‌దుల‌కు ద‌గ్గ‌ర‌వుత‌న్న హీరో కు దాదాపు 6 సంంత్స‌రాలు నుంచి ఒక బిగ్ హిట్ లేక పోవ‌డం అనేది కెరీర్ ను ప్ర‌భావితం చేసే అంశ‌మే క‌దా.!

ఎనీ వే తాజాగా విక్ర‌మ్ , స‌మంత లీడ్ రోల్ లో ముర‌గ‌దాస్ త‌ను శిశ్యుడు డైరెక్ట‌ర్ గా ఒక చిత్రం నిర్మిస్తున్నారు. ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న ఈ చిత్రం త‌మిళ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. యాక్ష‌న్, మాస్ , ల‌వ్ వంటి రెగ్యుల‌ర్ అంశాల్ని మేళ‌వించి చేసిన ఈ చిత్రం ట్రైల‌ర్ అంద‌ర్నీ అల‌రించే విధంగా ఉంది. విక్ర‌మ్ కు ఒక మంచి హిట్ ఇస్తుంద‌నే న‌మ్మ‌కం క‌లిగిస్తుంది. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయ‌డానికి గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నార‌ట‌. సినిమా ’10 ఎంద్రతుకుల్ల’.అనే టైటిల్ తో త‌మిళ‌లో వ‌స్తుంది.

Next Story