Telugu Global
Cinema & Entertainment

కంచె రిలీజ్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే...

కంచె సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. షూటింగ్ పూర్తిచేసుకోవడంతో పాటు ఆడియో వేడుక కూడా నిర్వహించారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. కానీ అనూహ్యంగా ఈ సినిమా రేసు నుంచి తప్పుకుంది. నిజానికి ఈరోజు, ఈపాటికి కంచె సినిమా థియేటర్లలో ఉండాలి. కానీ అన్ని హంగులు పూర్తయినప్పటికీ కంచె సినిమా ఊహించని విధంగా వాయిదాపడింది. దీనికి కారణాలేంటనేది అంతుచిక్కకుండా ఉంది. ఈ విషయంపై స్పందించడానికి దర్శకుడు క్రిష్ తో పాటు హీరో వరుణ్ తేజ కూడా […]

కంచె రిలీజ్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే...
X
కంచె సినిమాకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. షూటింగ్ పూర్తిచేసుకోవడంతో పాటు ఆడియో వేడుక కూడా నిర్వహించారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. కానీ అనూహ్యంగా ఈ సినిమా రేసు నుంచి తప్పుకుంది. నిజానికి ఈరోజు, ఈపాటికి కంచె సినిమా థియేటర్లలో ఉండాలి. కానీ అన్ని హంగులు పూర్తయినప్పటికీ కంచె సినిమా ఊహించని విధంగా వాయిదాపడింది. దీనికి కారణాలేంటనేది అంతుచిక్కకుండా ఉంది. ఈ విషయంపై స్పందించడానికి దర్శకుడు క్రిష్ తో పాటు హీరో వరుణ్ తేజ కూడా నిరాకరిస్తున్నారు. అటు నాగబాబు కూడా ఈ సినిమాపై స్పందించడం లేదు. దీంతో కంచె విడుదల ఎందుకు ఆగిపోయిందనే సస్పెన్స్ ను ఎవరూ చేధించలేకపోతున్నారు. అయితే సినిమాకు మరింత ప్రమోషన్ ఇచ్చి విడుదల చేయాలనే ఉద్దేశంతో కంచెను పోస్ట్ పోన్ చేసినట్టు చెబుతున్నారు మెగా సన్నిహితులు. హడావుడిగా సినిమాను రిలీజ్ చేసే కంటే.. మెగాహీరోలతో మంచిగా ప్రమోషన్ కల్పించి అప్పుడు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతానికైతే రిలీజ్ పోస్ట్ పోన్ వెనక కారణం ఇదే అంటున్నారు.
First Published:  1 Oct 2015 7:02 PM GMT
Next Story