Telugu Global
Cinema & Entertainment

రుద్రమను బ్రుస్ లీ బ్రతిమిలాడాడట...ఎందుకు...

రుద్రమదేవి సినిమాను వాయిదా వేయమని గుణశేఖర్ పై చాలా ఒత్తిడి తెచ్చారు టాలీవుడ్ బడా నిర్మాతలు. బ్రూస్ లీ సినిమా విడుదలకు వారం ముందు రుద్రమదేవిని థియేటర్లలోకి తేవడం మంచిది కాదని హితవు పలికారు. కానీ గుణశేఖర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన సినిమాను అక్టోబర్ 9నే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. గుణ ఇంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తున్నాడో ఎవరికీ అర్థంకాలేదు. దీనంతటికీ అసలు కారణం అల్లు అర్జున్. అవును.. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి రెండు […]

రుద్రమను బ్రుస్ లీ బ్రతిమిలాడాడట...ఎందుకు...
X
రుద్రమదేవి సినిమాను వాయిదా వేయమని గుణశేఖర్ పై చాలా ఒత్తిడి తెచ్చారు టాలీవుడ్ బడా నిర్మాతలు. బ్రూస్ లీ సినిమా విడుదలకు వారం ముందు రుద్రమదేవిని థియేటర్లలోకి తేవడం మంచిది కాదని హితవు పలికారు. కానీ గుణశేఖర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన సినిమాను అక్టోబర్ 9నే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. గుణ ఇంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తున్నాడో ఎవరికీ అర్థంకాలేదు. దీనంతటికీ అసలు కారణం అల్లు అర్జున్. అవును.. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి రెండు భారీ హిట్స్ తో ఊపుమీదున్న బన్నీ.. రుద్రమదేవిలో కీలకపాత్ర పోషించాడు. బన్నీ ఎప్పీయరెన్స్ తమ సినిమాకు కచ్చితంగా కలిసొస్తుందని భావిస్తున్నాడు గుణ. బ్రూస్ లీ మేనియాను అడ్డుకునే సత్తా బన్నీకి ఉందని భావిస్తున్నాడు. పైగా రుద్రమదేవి సినిమాలో బన్నీ ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు ఎంట్రీ ఇస్తాడట. సినిమా అయిపోయేవరకు ఉంటాడట. ఇలా టోటల్ సినిమాను బన్నీనే హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి.. రుద్రమదేవి కచ్చితంగా ఆడుతుందనే నమ్మకంతో ఉన్నాడు గుణశేఖర్. ఇదే అతడి ధైర్యానికి కారణం.
First Published:  1 Oct 2015 7:05 PM GMT
Next Story