Telugu Global
Cinema & Entertainment

ఒక్క పాటకు 3 కోట్లు ఖర్చు

3 కోట్ల రూపాయల బడ్జెట్ లో రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఏకంగా ఓ సినిమానే తీసేస్తాడు. కానీ మహేష్ బాబు సినిమా కోసం కేవలం ఒక్క సాంగ్ కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు నిర్మాతలు. ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం అనే సినిమా చేస్తున్నాడు మహేష్. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే ఓ ఫ్యామిలీ […]

ఒక్క పాటకు 3 కోట్లు ఖర్చు
X
3 కోట్ల రూపాయల బడ్జెట్ లో రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఏకంగా ఓ సినిమానే తీసేస్తాడు. కానీ మహేష్ బాబు సినిమా కోసం కేవలం ఒక్క సాంగ్ కోసం ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు నిర్మాతలు. ప్రస్తుతం ఇదే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం అనే సినిమా చేస్తున్నాడు మహేష్. రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే ఓ ఫ్యామిలీ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఏకంగా ఫిలింసిటీలో 3 కోట్ల రూపాయల ఖర్చుతో ఓ భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే ఈమధ్యంతా మహేష్, మిగతా నటీనటులతో ఓ పాట పిక్చరైజ్ చేశారు. ఇందులో నటీనటులతో పాటు దాదాపు 100మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. మరికొన్ని రోజులు ఫిలింసిటీలోనే బ్రహ్మోత్సవం షెడ్యూల్ నడుస్తుంది. తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని సెకెండ్ షెడ్యూల్ ప్రారంభిస్తారు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇలా ముగ్గురు హీరోయిన్లతో కలిసి మహేష్ సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
First Published:  1 Oct 2015 7:03 PM GMT
Next Story