Telugu Global
Others

విపక్షాల ఐక్యత- ఇరకాటంలో టీఆర్ఎస్

మొన్నటి వరకు వారి జెండాలు వేరు.. ఎజెండాలూ వేర్వేరు. కానీ అందర్నీ ఒక్క అంశం ఏకం చేసింది. తెలంగాణ అంతటా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించారు. రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ అమలుపై విపక్షాలన్నీ సభలో ఒకేమాట మీద నిలబడడంతో ప్రభుత్వమే ఇరుకున పడింది. దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. దీంతో శాసనసభలో ప్రభుత్వం డిఫైన్స్‌లో పడిపోయింది. విపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంచెప్పాలో తెలియక సభను సోమవారానికి […]

విపక్షాల ఐక్యత- ఇరకాటంలో టీఆర్ఎస్
X
మొన్నటి వరకు వారి జెండాలు వేరు.. ఎజెండాలూ వేర్వేరు. కానీ అందర్నీ ఒక్క అంశం ఏకం చేసింది. తెలంగాణ అంతటా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించారు. రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ అమలుపై విపక్షాలన్నీ సభలో ఒకేమాట మీద నిలబడడంతో ప్రభుత్వమే ఇరుకున పడింది. దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. దీంతో శాసనసభలో ప్రభుత్వం డిఫైన్స్‌లో పడిపోయింది. విపక్షాలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంచెప్పాలో తెలియక సభను సోమవారానికి వాయిదా వేయాల్సి వచ్చింది.
అంతకుముందు తెలంగాణలోని ప్రాజెక్టుల రీ డిజైన్ విషయంలో టీఆర్ఎస్ తీరును కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. రంగారెడ్డి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిరంకుశ విధానాలపై కలిసి పనిచేయాల్సిన విషయాన్ని రెండు పార్టీలు గుర్తించాయి. ఇక చీప్ లిక్కర్ ను తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయంపైనా రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచగలిగారు. తద్వారా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఇదే వైఖరితో విపక్షాలన్నీ ఏకమై ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే మరిన్ని ఫలితాలు సాధించే అవకాశం ఉంది. రుణమాఫీ విషయంలో వన్ టైం సెటిల్ మెంట్ కు ప్రభుత్వం అంగీకరించే వరకు ఐక్యంగా పోరాటం చేయాలని విపక్ష నాయకులు భావిస్తున్నారు.సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే ఐకమత్యంతో వ్యవహ‌రించి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు.. ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ విషయంలో టీఆర్ ఎస్ ప్రతిష్ట ఘోరంగా దెబ్బతిన్నది. ఆ అమ్మాయిని రేప్ చేసి చిత్రహింసలు పెట్టి ఎన్ కౌంటర్ చేశారని ప్రజలంతా నమ్ముతున్నారు. పలురాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమైనాయి. మొత్తం మీద మొన్నటి వరకు తెలంగాణ సెంటిమెంట్ తో నెట్టుకొస్తున్నఅధికార పార్టీ ఇప్పుడు విపక్షాల ఐక్యత నేపథ్యంలో మరింత జాగ్రత్తగా వ్యహరించాల్సిన అవసరం మాత్రం ఏర్పడింది.
First Published:  2 Oct 2015 12:01 AM GMT
Next Story