Telugu Global
Others

wonder world 43

వ్యవసాయం చేసి కోట్లు గడించొచ్చు! మహారాష్ట్రలోని కేబీ ఎక్స్‌పోర్ట్స్‌ అధినేత ప్రకాశ్‌ ఖాకర్‌ వ్యవసాయం చేసి కోట్లు గడించారు. ఆరేళ్ల క్రితం ముంబైలో ప్రకాశ్‌ ఖాకర్‌ పండ్లు, కూరగాయలు ఎగుమతి వ్యాపారం చేసేవాడు. ఉన్నట్టుండి ఆయనకో ఆలోచన వచ్చింది. అసలు రైతుల కోసం ఎదురుచూడకుండా మనమే పండిస్తే ఎలా ఉంటుంది.. అని ఖాకర్‌ ఆలోచించాడు. అహ్మద్‌నగర్‌ సమీపంలో ఓ 70 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్‌నగర్‌ ప్రాంతంలో నీటి సదుపాయాలు […]

wonder world 43
X

వ్యవసాయం చేసి కోట్లు గడించొచ్చు!

మహారాష్ట్రలోని కేబీ ఎక్స్‌పోర్ట్స్‌ అధినేత ప్రకాశ్‌ ఖాకర్‌ వ్యవసాయం చేసి కోట్లు గడించారు. ఆరేళ్ల క్రితం ముంబైలో ప్రకాశ్‌ ఖాకర్‌ పండ్లు, కూరగాయలు ఎగుమతి వ్యాపారం చేసేవాడు. ఉన్నట్టుండి ఆయనకో ఆలోచన వచ్చింది. అసలు రైతుల కోసం ఎదురుచూడకుండా మనమే పండిస్తే ఎలా ఉంటుంది.. అని ఖాకర్‌ ఆలోచించాడు. అహ్మద్‌నగర్‌ సమీపంలో ఓ 70 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మద్‌నగర్‌ ప్రాంతంలో నీటి సదుపాయాలు అంతగాలేవు. వ్యవసాయానికి అంతగా అనుకూలించే ప్రాంతమూ కాదు. అయినా మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్‌ అయిన కుమారుడు కౌశల్‌తో కలసి అక్కడ దానిమ్మ సాగు చేయడం ప్రారంభించాడు. దానిమ్మ పంట చేతికి రావడంతోనే గతంలో ఎగుమతి వ్యాపారానుభవంతో ఖాకర్‌ ‘కేబీ ఎక్స్‌పోర్ట్స్‌’ను ప్రారంభించాడు. ఈ సంస్థ ఏటా 700 టన్నుల దానిమ్మను ఎగుమతి చేస్తున్నది. ఐరోపాకు అత్యధికంగా దానిమ్మ ఎగుమతి చేస్తున్నది కేబీ ఎక్స్‌పోర్ట్సేనట. తన పొలంలో పంటతో పాటు అనేక మంది రైతుల ఉత్పత్తులను కూడా ఖాకర్‌ ఎగుమతి చేస్తున్నాడు. కేబీ ఎక్స్‌పోర్ట్స్‌ కేంద్రంగా మహారాష్ట్ర, గుజరాత్‌లలో దాదాపు 1000 ఎకరాలలో వందలాది మంది రైతులు పంటలు పండిస్తున్నారు. వీరందరికీ పెట్టుబడులు ఖాకర్‌ సమకూర్చుతాడు. ఒక రకంగా కాంట్రాక్ట్‌ వ్యవసాయమన్నమాట. కూరగాయలు గానీ, దానిమ్మ గానీ పండించిన తర్వాత ఖాకర్‌కే అమ్మాల్సి ఉంటుంది. మార్కెట్‌ రేటుకు తగ్గకుండా ఇస్తుండడంతో ఖాకర్‌కు రైతులకు మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎక్కువ సందర్భాలలో మార్కెట్‌ రేటుకు మించి కూడా ఖాకర్‌ ఇస్తుంటాడు. విత్తనాలు, వ్యవసాయ ఇన్‌పుట్స్‌, పంటలు పండిన తర్వాత మార్కెట్‌కు సరుకు రవాణా వంటివన్నీ ఖాకర్‌ భరిస్తాడు. మార్కెట్‌లో కిలో 12 నుంచి 15 రూపాయలకు దొరికే కూరగాయలకు ఖాకర్‌ రు.23 వరకూ ఇస్తుంటాడు. పొలం వద్దకు వచ్చి సరుకు తీసుకెళ్తాడు. ఇలాంటి సదుపాయముంటే రైతులకు ఎంత ఆనందంగా ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు కదా. కేబీ ఎక్స్‌పోర్ట్స్‌ లేకముందు అక్కడి రైతులు చాలా కష్టాలు పడేవారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర ఇన్‌పుట్స్‌ కోసం వ్యవసాయ పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడేవారు. అంతా సవ్యంగా పూర్తయి పంట చేతికొచ్చిన తర్వాత దానిని మార్కెట్‌కు తీసుకువెళ్లడం, ధర గిట్టుబాటు కాకపోయినా అందిన కాడికి అమ్ముకోవలసి రావడం వంటి కష్టాలన్నీ ఖాకర్‌ వల్ల అక్కడి రైతులకు తీరిపోయాయి. ”కూరగాయలు, పండ్లు త్వరగా పాడయిపోతాయి. అందుకని వాటిని ఎంత ధర లభిస్తే అంతకు త్వరగా అమ్ముకోవాలని రైతులు చూస్తారు. ఈ పరిస్థితిని దళారులు సొమ్ము చేసుకుంటుంటారు. నేను చేసిందేమీ లేదు. వారికి గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తాను. నాకూ లాభం ఉంటుంది. ఎవరూ నష్టపోనవసరం లేదు. ఈ భరోసాతో రైతులు ఆనందంగా పండించగలుగుతున్నారు.” అని ఖాకర్‌ తన సక్సెస్‌ స్టోరీని వివరించారు. కూరగాయల ఎగుమతికి సంబంధించి గత ఏడాది 30 కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించిన కేబీ ఎక్స్‌పోర్ట్స్‌ ఈ ఏడాది రు.75 కోట్ల టర్నోవర్‌ను అధిగమించింది. ఇపుడు కేబీ ఎక్స్‌పోర్ట్స్‌కు ఐరోపాలోని అన్ని దేశాల్లోనూ కార్యాలయాలున్నాయి. అక్కడి లైజాన్‌ సిబ్బంది ఆర్డర్ల తీసుకుని చెల్లింపులు చేస్తుంటారు. బ్రిటన్‌లోని మార్క్స్‌, స్పెన్సర్స్‌, సెయిన్‌బరీ వంటి చెయిన్‌ మార్కెటింగ్‌ సంస్థలతో కేబీ ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధాలున్నాయి. లండన్‌లోని కేబీ ఆఫీసు ఈ వ్యవహారాలు చూస్తుంది.

First Published:  30 Sep 2015 1:04 PM GMT
Next Story