Telugu Global
Others

డిగ్గీ రాజాపై సాధ్వి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మీడియాకెక్కే సాధ్వి ప్రాచీ మ‌రోసారి నోటికి ప‌నిచెప్పారు. ఈసారి ఆమె వ‌దిలిన మాట‌ల తూటాలు నేరుగా కొత్త పెళ్లికొడుకు, సీనీయర్ కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్‌ను, ఆయ‌న భార్య‌ను తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఘోర‌క్ పూర్‌లో ఆమె విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా విప‌క్షాల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. భార్య చ‌నిపోవ‌డంతో  దిగ్విజ‌య్ సింగ్ ఇటీవ‌ల అమృతా సింగ్ అనే టీవీ యాంక‌ర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే! ఈ […]

డిగ్గీ రాజాపై సాధ్వి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
X

నిత్యం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో మీడియాకెక్కే సాధ్వి ప్రాచీ మ‌రోసారి నోటికి ప‌నిచెప్పారు. ఈసారి ఆమె వ‌దిలిన మాట‌ల తూటాలు నేరుగా కొత్త పెళ్లికొడుకు, సీనీయర్ కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్‌ను, ఆయ‌న భార్య‌ను తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని ఘోర‌క్ పూర్‌లో ఆమె విలేక‌రుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా విప‌క్షాల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. భార్య చ‌నిపోవ‌డంతో దిగ్విజ‌య్ సింగ్ ఇటీవ‌ల అమృతా సింగ్ అనే టీవీ యాంక‌ర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే! ఈ వయసులో దిగ్విజ‌య్ పెళ్లి చేసుకున్నారు.. కొడుకుతో ఆడుకుంటారా… మనవళ్లతో ఆడుకుంటారా..?’ అంటూ సాధ్వి ఎద్దేవా చేశారు. మ‌రోవైపు సోనియా, రాహుల్‌నూ వ‌దిలిపెట్ట‌లేదు. రాహుల్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌ని తెలిసే.. సోనియా అత‌న్ని విదేశాల‌కు పంపార‌ని ఎద్దేవా చేశారు. బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను సైతం విమ‌ర్శ‌ల‌తో ఉతికి ఆరేసింది. దాణా కుంభ‌కోణంలో గ‌డ్డితిని జైలు కెళ్లిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ మాట‌లను ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని ఎగ‌తాళి చేశారు.

First Published:  30 Sep 2015 9:28 PM GMT
Next Story