Telugu Global
Cinema & Entertainment

భళ్లాల దేవ చేతికి మైక్రోమ్యాక్స్

బాహుబలి సినిమాతో మరోసారి బాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు రానా. ఇప్పటికే హిందీలో చాలా సినిమాలు చేసినప్పటికీ.. రానా కెరీర్ లో బాహుబలి సినిమా సమ్ థింగ్ స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాలో తొలిసారిగా విలన్ గా నటించిన రానా, బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మోస్ట్ పాపులర్ యాక్టర్ అయిపోయాడు. ఈ క్రేజే ఇప్పుడు ఈ పొడుగాటి హీరోకి ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. మైక్రోమ్యాక్స్ కు బ్రాండింగ్ ఇచ్చే బంగారం […]

భళ్లాల దేవ చేతికి మైక్రోమ్యాక్స్
X
బాహుబలి సినిమాతో మరోసారి బాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు రానా. ఇప్పటికే హిందీలో చాలా సినిమాలు చేసినప్పటికీ.. రానా కెరీర్ లో బాహుబలి సినిమా సమ్ థింగ్ స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమాలో తొలిసారిగా విలన్ గా నటించిన రానా, బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మోస్ట్ పాపులర్ యాక్టర్ అయిపోయాడు. ఈ క్రేజే ఇప్పుడు ఈ పొడుగాటి హీరోకి ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. మైక్రోమ్యాక్స్ కు బ్రాండింగ్ ఇచ్చే బంగారం లాంటి అవకాశం రానా చెంతకు చేరింది. త్వరలోనే దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా జరగనుంది. ఫార్మాలిటీస్ పూర్తయిన వెంటనే మైక్రోమ్యాక్స్ చేతపట్టుకున్న భళ్లాలదేవ టీవీల్లో, పోస్టర్లలో దర్శనమిస్తాడు. అంతేకాదు.. మైక్రోమ్యాక్స్ కు సంబంధించి కొన్ని ఈవెంట్స్ లో కూడా పాల్గొంటాడు. మరోవైపు ఇదే ప్రొడక్ట్ కు సంబంధించి రానాతోపాటు హీరోయిన్ అసిన్ కూడా తెరపై ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. మైక్రోమ్యాక్స్ సీఈవోనే అసిన్ పెళ్లాడింది. ప్రస్తుతం ఓ విభాగాన్ని పర్యవేక్షిస్తోంది కూడా.
First Published:  30 Sep 2015 7:04 PM GMT
Next Story