Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ కు ముందే  వెన‌కేసుకున్నారు..!

ఈమధ్య సినిమా విడుదలైతే తప్ప శాటిలైట్‌ హక్కుల వ్యవహారం కూడా తెగడం లేదు. కానీ ‘శివమ్‌’ చిత్రానికి అయిదున్నర కోట్లు విడుదలకి ముందే శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో వచ్చేశాయనేది    ర‌వికిషోర్  స‌న్నిహితులు స‌మాచారం. విడుదలకి ముందే టేబుల్‌ ప్రాఫిట్స్‌ వెనకేసుకున్న రవికిషోర్‌ అన్ని ఏరియాల్లోను అడ్వాన్స్‌ పద్ధతిలోనే ఈ చిత్రం రైట్స్‌ విక్రయించారు. ఇది చాలా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని, ఓవర్‌ఫ్లోస్‌ రూపంలో డబ్బులు ఏరులై పారతాయనీ ఆయన నమ్మకమట. రామ్‌ కూడా ఎప్పుడూ లేనంతగా ఈ […]

రిలీజ్ కు ముందే  వెన‌కేసుకున్నారు..!
X

ఈమధ్య సినిమా విడుదలైతే తప్ప శాటిలైట్‌ హక్కుల వ్యవహారం కూడా తెగడం లేదు. కానీ ‘శివమ్‌’ చిత్రానికి అయిదున్నర కోట్లు విడుదలకి ముందే శాటిలైట్‌ రైట్స్‌ రూపంలో వచ్చేశాయనేది ర‌వికిషోర్ స‌న్నిహితులు స‌మాచారం.
విడుదలకి ముందే టేబుల్‌ ప్రాఫిట్స్‌ వెనకేసుకున్న రవికిషోర్‌ అన్ని ఏరియాల్లోను అడ్వాన్స్‌ పద్ధతిలోనే ఈ చిత్రం రైట్స్‌ విక్రయించారు. ఇది చాలా పెద్ద బ్లాక్‌బస్టర్‌ అవుతుందని, ఓవర్‌ఫ్లోస్‌ రూపంలో డబ్బులు ఏరులై పారతాయనీ ఆయన నమ్మకమట. రామ్‌ కూడా ఎప్పుడూ లేనంతగా ఈ చిత్రం కోసం పబ్లిసిటీ దంచి కొడుతున్నాడు. సొంత సినిమా కాబట్టి లాభాల్లో వాటానే అడిగినట్టున్నాడు. కాబట్టి రామ్‌కి కూడా శివమ్‌తో గాట్టిగానే మిగులుతుండొచ్చు. ఈ చిత్రంలో రాసిఖ‌న్నా హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం శ్రీ‌నివాస రెడ్డి అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నాడు.మ‌రి రిలీజ్ కు ముందు మంచి బిజినెస్ చేసిన శివ‌మ్ రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ హిట్ కొడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Next Story