Telugu Global
NEWS

పట్టాలు తప్పిన విశాఖ రైల్వే జోన్‌?

ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రం ఏపీకి రైల్వే జోన్‌ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలో అసలు ఏపీ రైల్వే జోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని, ఏపీకి రైల్వే జోన్‌ ఎందుకని ప్రశ్నించారు బోర్డు ఛైర్మన్‌ ఏకే మిట్టల్‌. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక జోన్‌ అవసరం లేదని చెబుతూనే.. విశాఖ జోన్‌ వల్ల భువనేశ్వర్‌ నష్టపోతుందని, పైగా ఒడిశా నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నదని తెలిపింది. ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో తనతో భేటీ అయిన […]

పట్టాలు తప్పిన విశాఖ రైల్వే జోన్‌?
X

ప్రత్యేక హోదా ఇచ్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రం ఏపీకి రైల్వే జోన్‌ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తోంది. ఈనేపథ్యంలో అసలు ఏపీ రైల్వే జోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని, ఏపీకి రైల్వే జోన్‌ ఎందుకని ప్రశ్నించారు బోర్డు ఛైర్మన్‌ ఏకే మిట్టల్‌. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక జోన్‌ అవసరం లేదని చెబుతూనే.. విశాఖ జోన్‌ వల్ల భువనేశ్వర్‌ నష్టపోతుందని, పైగా ఒడిశా నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నదని తెలిపింది. ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో తనతో భేటీ అయిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుకు రైల్వే బోర్డు చైర్మన్‌ ఏకే మిట్టల్‌ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. సాంకేతిక అంశాలపరంగా చూసినా ఏపీలో కొత్త జోన్‌ ఏర్పాటు చాలా కష్టమని కూడా తేల్చి చెప్పారు. అయినా విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాజకీయంగా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలని ఆయన ఐవైఆర్‌ కృష్ణారావుతో అన్నట్టు తెలిసింది. పట్టాలు తప్పిన విశాఖ రైల్వే జోన్‌ ప్రతిపాదన సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వచ్చి ప్రధాని మోడితో చర్చిస్తే తప్ప మళ్ళీ పట్టాలెక్కే అవకాశం లేదని అంటున్నారు.

First Published:  30 Sep 2015 8:01 PM GMT
Next Story