Telugu Global
Cinema & Entertainment

ఫాలోయింగ్ ప‌వ‌రెక్కువ అంటున్న నిహారిక‌..!

సాధారణంగా కొత్త హీరోయిన్లకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు మించి ఇవ్వరు. కానీ మెగా వారి అమ్మాయి నిహారిక తొలి సినిమాకే రూ. 40 లక్షలు తీసుకుంటుండటం గమనార్హం. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయి కావడం సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయి. అందు వల్లనే ఆమెకు ఇంత ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మెగా స్టార్ వారసత్వంతో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు దాదాపు అరడజను మంది హీరోలు […]

ఫాలోయింగ్ ప‌వ‌రెక్కువ అంటున్న నిహారిక‌..!
X

సాధారణంగా కొత్త హీరోయిన్లకు రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు మించి ఇవ్వరు. కానీ మెగా వారి అమ్మాయి నిహారిక తొలి సినిమాకే రూ. 40 లక్షలు తీసుకుంటుండటం గమనార్హం. మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న అమ్మాయి కావడం సినిమాకు ఓపెనింగ్స్ బావుంటాయి. అందు వల్లనే ఆమెకు ఇంత ఎక్కువ మొత్తం రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మెగా స్టార్ వారసత్వంతో మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటి వరకు దాదాపు అరడజను మంది హీరోలు పరిచయం అయ్యారు. అయితే ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ మాత్రం ఇప్పటి వరకు సినిమా రంగంలోకి రాలేదు. నాగబాబు కూతురు నిహారిక మెగా ఫ్యామిలీలో కొత్త శకానికి నాంది పలికింది. ఈ ముద్దుగుమ్మ త్వరలో ‘ఒక మనసు’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు.మొత్తం మీద మెగా కుటుంబానికి వున్న అభిమాన 'ధ‌నం' బాగా క‌లిసొస్తుంది వార‌సుల‌కు అన‌డానిక ఇదొక ఎగ్జాంపుల్ క‌దా.

Next Story