Telugu Global
National

నేపాల్ రాజ్యాంగానికి బీహార్ ఎన్నికలకు లంకె

అవును. మీరు సరిగానే చదివారు. అదెలా? అది తెలుసుకోవాలంటే మనం అయిదారేళ్ళువెనక్కి వెళ్ళాల్సిందే. నేపాల్ లో 2010లో నాడు ప్రధానిగా వున్న గిరిప్రసాద్ కొయిరాలా కన్ను మూశారు. ఆయన అంత్య క్రియలకు బిజెపి నాయకుని హోదాలో వెళ్ళిన ప్రస్తుత హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ‘నేపాల్ హిందూ రాజ్యంగా వున్నందుకు మేము ఎంతో గర్వపడేవాళ్ళం. నేపాల్ మళ్లి హిందూ రాజ్యంగా మారితే నేను ఎంతో సంతోషిస్తా’ అని అన్నారు. నేపాల్ హిందూ రాజ్యంగా ఏర్పాటు గురించి […]

నేపాల్ రాజ్యాంగానికి బీహార్ ఎన్నికలకు లంకె
X

అవును. మీరు సరిగానే చదివారు. అదెలా? అది తెలుసుకోవాలంటే మనం అయిదారేళ్ళువెనక్కి వెళ్ళాల్సిందే. నేపాల్ లో 2010లో నాడు ప్రధానిగా వున్న గిరిప్రసాద్ కొయిరాలా కన్ను మూశారు. ఆయన అంత్య క్రియలకు బిజెపి నాయకుని హోదాలో వెళ్ళిన ప్రస్తుత హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ‘నేపాల్ హిందూ రాజ్యంగా వున్నందుకు మేము ఎంతో గర్వపడేవాళ్ళం. నేపాల్ మళ్లి హిందూ రాజ్యంగా మారితే నేను ఎంతో సంతోషిస్తా’ అని అన్నారు. నేపాల్ హిందూ రాజ్యంగా ఏర్పాటు గురించి ప్రచారం చేయడం కోసం భారత్ నుంచి హిందుత్వ సంస్థలు తమ ప్రతినిధులను పంపాయి.

అలాంటిది హిందూ రాజ్యం ఏర్పాటు చేయకుండా లౌకిక రాజ్యం ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని రూపొందించడం సహజంగానే బిజెపి ప్రభుత్వానికి నచ్చలేదు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ సరిహద్దులకు ఆవల నేపాల్ లో నివసించే మదేషి తెగ వారితో బిహారీలకు సంబంధాలు వున్నాయి. ఇది అదనుగా బిజెపి పనుపున హిందూ సంస్థలు మదేషిలకు లోపాయికారి మద్దతు ఇస్తున్నాయి. తద్వారా బీహార్ లబ్ది పొందాలని బిజెపి చూస్తోందని విమర్శలు వచ్చాయి. అనాదిగా ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యంగా పేరొందిన నేపాల్ లౌకిక రాజ్యంగా మారడం బిజెపికి సుతరాము ఇష్టం లేదు. ఈ విషయాన్ని బయటికి చెప్పలేరు. అలా అని దిగమింగలేరు. అదే నేపాల్ పట్ల ప్రతికూల భావనకు దారితీసింది. కాగా మదేషిలు దేశ జనాభాలో దాదాపు సగం మంది వుంటారు. దేశాన్ని ఏడు రాష్ట్రాలుగా విభజిస్తూ సమాఖ్య రాజ్యాంగాన్ని చేపట్టడాన్ని మదేషి , థారు వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి సమస్యలు న్యాయ సమ్మతమే కావచ్చు. కానీ మోడీ ప్రభుత్వం నేపాల్ రాజ్యాంగ రూపకల్పనలో కలుగజేసుకోవడం ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. నేపాల్ పాలకులు ఇదే విషయాన్నీ చెప్పి భారత్ అభ్యర్ధనను సున్నితంగా తిరకరించారు. అక్కడి విద్యార్ధి సంఘాలు మోడికి, భారత్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపాయి. మోడీ దిష్టి బొమ్మను, భారత జెండాను తగులబెట్టారు. మోడీ ప్రభుత్వం నేపాల్ వ్యవహారంలో దూకుడుగా జోక్యం చేసుకోవడం వల్ల రెండు పొరుగు దేశాల మధ్య చాలా కాలంగా వస్తున్న సత్సంబంధాలు దెబ్బ తినేందుకు దారితీసాయి. అంతే కాక భారత్ ‘పెద్దన్న’ వలె వ్యవహరిస్తోందని దక్షిణాసియాలోని ఇతర దేశాలు అభిప్రాయ పడే పరిస్థితి ఏర్పడింది. తదుపరి పరిణామాలు ఎటు దారితీస్తాయో?

First Published:  1 Oct 2015 12:22 AM GMT
Next Story