Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 222

చింటు: టెలిఫోన్‌ తీగలు అంతపైగా ఎందుకుంటాయి? బంటు: ఇతర్ల మాటలు ఎవరూ వినకూడదని? ————————————————- కిరణ్‌ యాక్సిడెంటై గాయపడ్డాడు. అంబులెన్స్‌ అతను: “అబ్బాయీ! నీ పేరు చెప్పు దానివల్ల మీ వాళ్ళకు తెలియజేసే అవకాశం ఉంటుంది. కిరణ్‌: మా వాళ్ళకు ఎప్పుడో నా పేరు తెలుసు. ————————————————- శ్రీమతి కళ: మా ఆయన ప్రతిరోజూ పొద్దున్నే నన్ను కొడతారు. శ్రీమతి పరిమళ: అయ్యో పాపం! ఎందుకని. శ్రీమతి కళ: మా ఆయన పొద్దున్నే ఏడుగంటలకు నిద్రలేస్తారు. నేను […]

చింటు: టెలిఫోన్‌ తీగలు అంతపైగా ఎందుకుంటాయి?
బంటు: ఇతర్ల మాటలు ఎవరూ వినకూడదని?
————————————————-
కిరణ్‌ యాక్సిడెంటై గాయపడ్డాడు.
అంబులెన్స్‌ అతను: “అబ్బాయీ! నీ పేరు చెప్పు దానివల్ల మీ వాళ్ళకు తెలియజేసే అవకాశం ఉంటుంది.
కిరణ్‌: మా వాళ్ళకు ఎప్పుడో నా పేరు తెలుసు.
————————————————-
శ్రీమతి కళ: మా ఆయన ప్రతిరోజూ పొద్దున్నే నన్ను కొడతారు.
శ్రీమతి పరిమళ: అయ్యో పాపం! ఎందుకని.
శ్రీమతి కళ: మా ఆయన పొద్దున్నే ఏడుగంటలకు నిద్రలేస్తారు. నేను ఎనిమిది గంటలకు లేస్తాను. నన్ను గంటసేపు కొట్టిలేపుతారు.
————————————————-
వెంకట్‌: నువ్వు నన్ను పెళ్ళిచేసుకోకుంటే నీ ఇంటిముందే నేను ఉరితీసుకుంటాను.
శైలజ: ప్లీజ్‌! మా ఇంటిముందు ఆ పని చెయ్యకు. ఉరితీసుకున్న వాళ్ళని చూడ్డం మా నాన్నగారికి ఇష్టముండదు, ఇంకెక్కడన్నా ఆ పనిచెయ్‌.

First Published:  30 Sep 2015 1:03 PM GMT
Next Story