Telugu Global
Cinema & Entertainment

బ్రూస్ లీ కోసం హైటెక్స్ రెడీ

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న బ్రూస్ లీ ఆడియో వేడుకకు ఏర్పాట్లు శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ ను మరింత గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తోంది యూనిట్. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్స్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు జరగబోయే బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ కు రావాల్సిందిగా ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు మెగాభిమానులకు కూడా ఆహ్వానాలు అందిపోయాయి. అయితే స్పెషల్ గెస్ట్ […]

బ్రూస్ లీ కోసం హైటెక్స్ రెడీ
X
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న బ్రూస్ లీ ఆడియో వేడుకకు ఏర్పాట్లు శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ ను మరింత గ్రాండ్ గా నిర్వహించాలని భావిస్తోంది యూనిట్. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్స్ గ్రౌండ్స్ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు జరగబోయే బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ కు రావాల్సిందిగా ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు మెగాభిమానులకు కూడా ఆహ్వానాలు అందిపోయాయి. అయితే స్పెషల్ గెస్ట్ అంటూ ఎవరూ ఉండట్లేదు. అఖిల్ సినిమా ఆడియోకు మహేష్ వచ్చినట్టు బ్రూస్ లీ ఆడియోకు ఎవరూ ప్రత్యేకంగా రావడం లేదు. అందకి కంటే మెయిన్ ఎట్రాక్షన్ అక్కడ చిరంజీవే. అవును.. గతంలో రామ్ చరణ్ నటించిన ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి వచ్చారు. బ్రూస్ లీ ఆడియో కు కూడా చిరు వస్తున్నారు. ఇందులో కొత్తేం లేదు. కాకపోతే.. ఈసారి బ్రూస్ లీలో చిరంజీవి ఓ కీలకపాత్ర కూడా పోషించడంతో చిరు రాక సమ్ థింగ్ స్పెషల్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని సంగతుల్ని ఆడియో వేదికపై చిరంజీవి వెల్లడించే అవకాశం ఉంది. పాటలతో పాటు థియేట్రికల్ ట్రయిలర్ ను కూడా రేపు విడుదల చేస్తారు.
First Published:  30 Sep 2015 7:03 PM GMT
Next Story