Telugu Global
Others

లూప్‌లోకి అన్నగారి ఫ్యామిలీ

టీడీపీతో ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధం లేదంటే ఊహించుకోగలమా?. పార్టీలో అన్నగారి కుటుంబానికి చోటే ఉండదంటే నమ్మగలమా?. ప్రస్తుతానికి నమ్మకలేకపోయినా ఫ్యూచర్‌లో మాత్రం అది నిజమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. అన్నగారి పార్టీ కాస్త పూర్తి స్థాయిలో నారావారి పార్టీగా మారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రకటించిన పొలిట్‌బ్యూరో, కేంద్ర, ఏపీ, తెలంగాణ కమిటీల జాబితాను పరిశీలిస్తే అన్నగారి ఫ్యామిలీలో లూప్‌లోకి వెళ్లిపోయినట్టేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇకపై టీడీపీ తండ్రికొడుకుల సొంతపార్టీయేనంటున్నారు పొలిట్‌బ్యూరోలో హరిక‌‌ృష్ణ కు […]

లూప్‌లోకి అన్నగారి ఫ్యామిలీ
X

టీడీపీతో ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధం లేదంటే ఊహించుకోగలమా?. పార్టీలో అన్నగారి కుటుంబానికి చోటే ఉండదంటే నమ్మగలమా?. ప్రస్తుతానికి నమ్మకలేకపోయినా ఫ్యూచర్‌లో మాత్రం అది నిజమయ్యే పరిస్థితే కనిపిస్తోంది. అన్నగారి పార్టీ కాస్త పూర్తి స్థాయిలో నారావారి పార్టీగా మారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రకటించిన పొలిట్‌బ్యూరో, కేంద్ర, ఏపీ, తెలంగాణ కమిటీల జాబితాను పరిశీలిస్తే అన్నగారి ఫ్యామిలీలో లూప్‌లోకి వెళ్లిపోయినట్టేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇకపై టీడీపీ తండ్రికొడుకుల సొంతపార్టీయేనంటున్నారు

పొలిట్‌బ్యూరోలో హరిక‌‌ృష్ణ కు చోటు కల్పించడం మినహా మరెక్కడా ఎన్టీఆర్ ఫ్యామిలీ వాసనే కనిపించకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. హరికృష్ణకు పొలిట్ బ్యూరోలో స్థానం కూడా ప్రేమతో ఇచ్చింది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే హరి ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆయనను తొలగిస్తే బ్రహ్మాండం బద్ధలవుతుందన్న విషయం చంద్రబాబుకూ తెలియనిది కాదు. ఇటీవల ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షి పట్ల ప్రభుత్వ తీరును బహిరంగంగానే తప్పుపట్టి తనలో ఫైర్ తగ్గలేదని హరికృష్ణ పరోక్ష హెచ్చరికలు కూడా జారీ చేశారు. పైగా తనయుడు లోకేష్‌ను అందలం ఎక్కించే తొలి ఘడియాలాయే. ఈ సమయంలో హరికృష్ణతో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని అంచనా వేయలేనంత అమాయకుడు కాదు చంద్రబాబు. అందుకే హరిని యథాతథంగా అదే పొజిషన్‌తో సరిపెట్టారు. భవిష్యత్తులో హరికృష్ణను పొలిట్ బ్యూరో నుంచి సాగనంపినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక కమిటీల్లో అసలు బాలయ్య పేరు కనిపించకపోవడం ఆశ్చర్యకరమైన అంశం. దీనిపై పార్టీలో కొత్త చర్చ జరుగుతోంది. ఒకవేళ బాలయ్యకు చోటు కల్పించాల్సి వస్తే మంచి స్థానమే ఇవ్వాలి. అదే చేస్తే సెంట్రాఫ్ అట్రాక్షన్ బాలక‌ృష్ణే అవుతారు. భవిష్యత్తులో బాలయ్య కూడా ఓ పవర్ సెంటర్ అన్న అభిప్రాయం కలుగుతుంది. అప్పుడు నేతలు బాలయ్యతో పరిచయాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎలాగు సినిమా హీరో కాబట్టి మీడియా ఫోకస్ కూడా ఆయన మీదే ఉంటుంది. అప్పుడు లోకేష్‌బాబుకు రావాల్సినంత మైలేజ్, క్రేజ్ రాదు. లోకేష్ తన అల్లుడన్న బలహీనత బాలయ్యకు ఎలాగో ఉండనే ఉంది. కాబట్టి ఇదే అదునుగా బాలయ్యను దూరం పెట్టినట్టు భావిస్తున్నారు.

బాలయ్యకు అల్లుడి సెంటిమెంట్ అడ్డు. హరిక‌ృష్ణది ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని స్థితి. పురందేశ్వరి పార్టీ దరిదాపుల్లో లేరు. మిగిలిన ఎన్టీఆర్ కుటుంబసభ్యులు రాజకీయాలకు ఎలాగు దూరంగా ఉన్నారు. సో… ఊహించని అద్భుతం జరిగితే తప్ప తెలుగు దేశాన్ని తిరిగి అన్నగారి కుటుంబం చేతుల్లో చూడలేమన్న అభిప్రాయాన్ని ఎన్టీఆర్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మొత్తం నారావారి చేతుల్లోకి వెళ్లిపోయినట్టేనని వారు బలంగా నమ్ముతున్నారు.

First Published:  30 Sep 2015 10:19 PM GMT
Next Story