Telugu Global
NEWS

ఏపీలో పెట్రోల్ బంకుల స‌మ్మె

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి పెట్రోల్ బంకుల స‌మ్మెకు సైర‌న్ మోగింది. లీటర్‌పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన రూ.4ల వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ పెట్రోల్‌ బంకు డీలర్లు, లారీలు, ఆయిల్‌ ట్యాంకర్స్‌ అసోసియేషన్లు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌, ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, ఏపీ పెట్రోల్‌ ట్యాంక్‌, ట్రక్‌ ఆపరేషన్స్‌ అసోసియేషన్లు జేఏసీగా ఏర్పడి అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి నిరవధిక బంద్‌ చేస్తున్నట్లు ఏపీఎ్‌ఫపీటీ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. […]

ఏపీలో పెట్రోల్ బంకుల స‌మ్మె
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రోసారి పెట్రోల్ బంకుల స‌మ్మెకు సైర‌న్ మోగింది. లీటర్‌పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన రూ.4ల వ్యాట్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ పెట్రోల్‌ బంకు డీలర్లు, లారీలు, ఆయిల్‌ ట్యాంకర్స్‌ అసోసియేషన్లు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ట్రేడర్స్‌, ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌, ఏపీ పెట్రోల్‌ ట్యాంక్‌, ట్రక్‌ ఆపరేషన్స్‌ అసోసియేషన్లు జేఏసీగా ఏర్పడి అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి నిరవధిక బంద్‌ చేస్తున్నట్లు ఏపీఎ్‌ఫపీటీ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. వ్యాట్ కార‌ణంగా త‌మ వ్యాపారం స‌న్న‌గిల్లింద‌ని, తామ వ్యాపారాలు న‌ష్టాల్లో న‌డుస్తున్నాయ‌ని ఆయ‌న వాపోయారు. ప్ర‌భుత్వం వ్యాట్‌పై పునఃస‌మీక్ష జ‌రిపి, వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు.

30 రోజుల్లో రెండోసారి!

ఇదే డిమాండ్‌పై ఆగ‌స్టు 30న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్ బంకుల స‌మ్మె జ‌రిగింది. ఇంత‌లోనే మ‌రోసారి అదే డిమాండ్‌పై స‌మ్మె జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం పెట్రోల్‌ బంకు డీలర్లు, లారీలు, ఆయిల్‌ ట్యాంకర్స్‌ అసోసియేషన్ల డిమాండ్ల‌ను ప‌రిశీలించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. వీరికి మ‌ద్ద‌తుగా లారీల అసోసియేష‌న్ కూడా స‌మ్మెలో పాల్గొననుంది. దీంతో ఏపీలో రేప‌టి నుంచి ప్ర‌యివేటు ర‌వాణా స్తంభించిపోనుంది. పోయిన‌సారి జ‌రిగిన స‌మ్మె కార‌ణంగా ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులు, కార్లు, ఆటోల య‌జ‌మానులు, ప్ర‌యివేటు రవాణా మీద ఆధార‌ప‌డ్డ‌వారు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ముఖ్యంగా కూర‌గాయ‌లు, తాగునీరు, ఇత‌ర వ్యాపారాల‌కు కీల‌క‌మైన లారీలు ఎక్క‌డిక‌క్క‌డ స్తంభించిపోనున్నాయి. ఇది సామాన్యుల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. కాగా, స‌మ్మెకు సీపీఎం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.

First Published:  30 Sep 2015 8:08 PM GMT
Next Story