చేజారిన సినిమానే మళ్లీ అందివస్తోంది..?
చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి హాట్ లేటెస్ట్ అప్ డేట్ ఇది. పూరీ జగన్నాధ్ నుంచి చేజారిందనుకున్న ఈ సినిమా ఇప్పుుడ మళ్లీ అతడి చేతికే వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చిరు 150వ సినిమాకు సంబంధించి పూరి సంచలన ప్రకటన చేసిన 24 గంటల్లోనే మెగా కాంపౌండ్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్ స్వయంగా పూరి ఇంటికెళ్లి అతడితో చర్చలు జరిపాడు. దర్శకుడి సంగతి పక్కనపెట్టి.. ముందు 150వ సినిమాకు సంబంధించిన కథను […]
BY admin29 Sep 2015 7:23 PM GMT

X
admin29 Sep 2015 7:23 PM GMT
చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి హాట్ లేటెస్ట్ అప్ డేట్ ఇది. పూరీ జగన్నాధ్ నుంచి చేజారిందనుకున్న ఈ సినిమా ఇప్పుుడ మళ్లీ అతడి చేతికే వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చిరు 150వ సినిమాకు సంబంధించి పూరి సంచలన ప్రకటన చేసిన 24 గంటల్లోనే మెగా కాంపౌండ్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్ స్వయంగా పూరి ఇంటికెళ్లి అతడితో చర్చలు జరిపాడు. దర్శకుడి సంగతి పక్కనపెట్టి.. ముందు 150వ సినిమాకు సంబంధించిన కథను కంప్లీట్ చేయమని పురమాయించాడట. దీనికి పూరి జగన్నాధ్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే విశ్లేషకుల మాట మరోలా ఉంది.. పూరి జగన్నాధ్ వివాదాస్పద ప్రకటన చేశాడు కాబట్టి.. చెర్రీ అతడి దగ్గరకొచ్చి కాంప్రమైజ్ కాలేదంటున్నారు విశ్లేషకులు. చిరంజీవికి ఇప్పటివరకు సరైన కథ దొరక్కపోవడంతో.. తిరిగి మళ్లీ పూరీ దగ్గరకే వచ్చాడని అంచనా కడుతున్నారు. సరే.. అంచనాలు ఎలా ఉన్నప్పటికీ.. చిరంజీవి 150వ సినిమా త్వరగా పట్టాలపైకి వస్తే అదే పదివేలు అని భావిస్తున్నారు మెగాఫ్యాన్స్.
Next Story