Telugu Global
Cinema & Entertainment

కూతురిపై  క్లారీటి ఇచ్చిన శ్రీదేవి...

బాల‌న‌టిగా  కెరీర్ ప్రారంభించి..  ఆల్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ అనిపించుకున్న  మ‌న తెలుగు హీరోయిన్ శ్రీ‌దేవి.  బాలీవుడ్ లో   త‌న స‌మ‌కాలీన  న‌టీ మ‌ణుల్ని   ఢీ కొట్టి  బి టౌన్ లో  ద‌క్షిణాది హీరోయిన్ ల జెండా ఎగ‌రేసింది.   దాదాపు ద‌శాబ్దం పాటు  స్టార్ హీరోయిన్ గా హ‌ల్ చ‌ల్ చేసి.. చివ‌ర‌కు ప్రొడ్యూస‌ర్ బోణి క‌పూర్ ను పెళ్లి చేసుకుని  గృహిణిగా స్థిర ప‌డింది.  సినిమాల‌కు  ఇక గుడ్ బై చెప్పిసిన‌ట్లే […]

కూతురిపై  క్లారీటి ఇచ్చిన శ్రీదేవి...
X
బాల‌న‌టిగా కెరీర్ ప్రారంభించి.. ఆల్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ అనిపించుకున్న మ‌న తెలుగు హీరోయిన్ శ్రీ‌దేవి. బాలీవుడ్ లో త‌న స‌మ‌కాలీన న‌టీ మ‌ణుల్ని ఢీ కొట్టి బి టౌన్ లో ద‌క్షిణాది హీరోయిన్ ల జెండా ఎగ‌రేసింది. దాదాపు ద‌శాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా హ‌ల్ చ‌ల్ చేసి.. చివ‌ర‌కు ప్రొడ్యూస‌ర్ బోణి క‌పూర్ ను పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిర ప‌డింది. సినిమాల‌కు ఇక గుడ్ బై చెప్పిసిన‌ట్లే అనుకుంటున్న స‌మ‌యంలో.. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో గ్రాండ్ రీ ఎంట్రి ఇచ్చి మెప్పంచింది.
అయితే గ‌త కొంత కాలం నుంచి శ్రీ‌దేవి పెద్ద కూతురు జాహ్న‌వి హీరోయిన్ గా ఎంట్రీ వుంటుంద‌ని ప‌లు మార్లు బి టౌన్ లో న్యూస్ హ‌ల్ చ‌ల్ చేశాయి. ఈ మ‌ధ్య కూడా త‌మిళ సూప‌ర్ స్టార్ మ‌మ్మూటి త‌న‌యుడు దుల్క‌ర్ స‌ల్మాన్ స‌ర‌స‌న సినిమా ఒకే అయ్యింద‌నే వార్తలు కూడా వినిపించాయి. ఇటువంటి రూమ‌ర్స్ కు శ్రీ‌దేవి క్లారీటి ఇచ్చారు. ప్ర‌స్తుతం త‌న ఇద్ద‌రు కూతుర్లు చ‌దువుతున్నార‌ని. వారి చ‌దువు పూర్తి అయ్యే వ‌ర‌కు ఎటువంటి ఒత్తిడి వుండ‌ద‌ని చెప్పారు. సినిమా అనేది వాళ్ల‌కు ఆస‌క్తి వుంటే త‌ప్ప‌.,. తాము బ‌ల‌వంత పెట్ట‌డం వుండ‌ద‌ని చెప్పారు. పెద్ద కూతురు గ్రాడ్యుయేష‌న్ కోసం ఫారిన్ లో వున్నార‌ట‌. చిన్న‌మ్మాయి ముంబాయిలో ఇంట‌ర్మీడియ‌ట్ చేస్తుంద‌ని తెలిపారు. సో .. ఇప్ప‌ట్లో శ్రీ‌దేవి కూతుళ్లు హీరోయిన్స్ గా ఎంట్రి ఇచ్చే ప‌రిస్థితే లేద‌న్న‌మాట‌.
ఇక శ్రీ‌దేవి న‌టించిన పులి చిత్రం త‌మిళ‌, తెలుగు నాట గురువారం రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో శ్రీ‌దేవి రోల్ చాల కీల‌కంగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ టాక్. సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రీ‌దేవి త‌న వ‌య‌సు, స్టార్ డ‌మ్ కు త‌గ్గ చిత్రా ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.
First Published:  29 Sep 2015 9:30 PM GMT
Next Story