Telugu Global
National

మత ఘర్షణలతో భగ్గుమన్న రాంచి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని కళలున్నాయి. కులం, మతం, దానికి తోడు హింసాకాండ, హత్యలు… ఇది వుంది అది లేదు అని చెప్పలేం. టికెట్లు పొందిన వారిలో మెజారిటీ నేర చరితులే. అభ్యర్ధి సామర్ధ్యం వారి నేరాల చిట్టాను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తారు. జనం బిక్కు బిక్కుమంటూ గడుపుతారు. బీహార్ నుంచి వేరుపడిన జార్ఖండ్‌లో ఇప్పుడు తాజాగా మత ఘర్షణలు జరిగాయి. అది కూడా […]

మత ఘర్షణలతో భగ్గుమన్న రాంచి
X

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని కళలున్నాయి. కులం, మతం, దానికి తోడు హింసాకాండ, హత్యలు… ఇది వుంది అది లేదు అని చెప్పలేం. టికెట్లు పొందిన వారిలో మెజారిటీ నేర చరితులే. అభ్యర్ధి సామర్ధ్యం వారి నేరాల చిట్టాను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తతతో వ్యవహరిస్తారు. జనం బిక్కు బిక్కుమంటూ గడుపుతారు. బీహార్ నుంచి వేరుపడిన జార్ఖండ్‌లో ఇప్పుడు తాజాగా మత ఘర్షణలు జరిగాయి. అది కూడా జార్ఖండ్ రాజధాని రాంచిలో. రాజధాని నగరంలో మత ఘర్షణలను అదుపు చేయడానికి, జనం సంయమనంతో వ్యవహరించాలని కోరడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్ పర్యటించారు. అయితే మళ్లి రెండు రోజుల్లోనే సోమవారం రాత్రి ఘర్షణలు జరిగాయి. రెండు మతాల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఎవరూ గాయపడనప్పటికి పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. బిహార్ ఎన్నికల ముందు మత ఘర్షణలు జరగడంతో పోలీస్ ఉన్నతాధికారులు హింసాకాండ జరిగిన స్థలంలో వుండి పరిస్థితిని నియంత్రిస్తున్నారు. రాంచిలో రెండు ప్రార్ధనా మందిరాల ఎదుట మాంసం వేశారని కొన్ని పత్రికలలో వార్తలు కూడా వచాయి. కాళీ మందిర్ ఎదుట, శివార్లలోని ఒక మసీద్ ఎదుట మాంసం కనిపించాయన్న వార్తలతో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

First Published:  30 Sep 2015 7:02 AM GMT
Next Story