Telugu Global
Others

ముంబై రైలు పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరి

2006 జులైలో ముంబాయిలోని లోకల్‌ ట్రైన్లలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన  దోషులకు  ముంబాయి మోకా న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. మరో ఏడుగురికి జీవిత ఖైధు విధిస్తూ తీర్పు చెప్పింది. 2006 జరిగిన పేలుళ్లలో మొత్తం 189 మంది చనిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఈకేసులో 12 మందిని దోషులుగా కోర్టు తేల్చింది. నేడు శిక్ష ఖరారు చేసింది.   2006 జూలై 11న సిమీ, లష్కరే తోయిబాతో సంబంధాలున్న […]

ముంబై రైలు పేలుళ్ల కేసులో ఐదుగురికి ఉరి
X
2006 జులైలో ముంబాయిలోని లోకల్‌ ట్రైన్లలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన దోషులకు ముంబాయి మోకా న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. మరో ఏడుగురికి జీవిత ఖైధు విధిస్తూ తీర్పు చెప్పింది. 2006 జరిగిన పేలుళ్లలో మొత్తం 189 మంది చనిపోయారు. కొద్ది రోజుల క్రితమే ఈకేసులో 12 మందిని దోషులుగా కోర్టు తేల్చింది. నేడు శిక్ష ఖరారు చేసింది.
2006 జూలై 11న సిమీ, లష్కరే తోయిబాతో సంబంధాలున్న ఉగ్రవాదులు ముంబైలోని సబర్బన్ రైళ్లలో వరుసగా ఏడు పేలుళ్లకు పాల్పడ్డారు. సాయంత్రం ఆరున్నర సమయంలో పది నిమిషాల వ్యవధిలో ఖర్‌రోడ్, బాంద్రా, శాంతాక్రజ్, జోగేశ్వరి, మాహిమ్ జంక్షన్, మిరారోడ్, మతుంగ, బొరివలి ప్రాంతాల మధ్య ప్రయాణిస్తున్న రైళ్లలో పేలుళ్లు జరిగాయి. 189 మరణించగా… 829 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మోకా చట్టంతో పాటు ఐపీసీ, పేలుడు పదార్థాల చట్టం, రైల్వే యాక్ట్ తదితర చట్టాల కింద 30 మందిపై మహారాష్ట్ర యాంటీ టైజం స్క్వాడ్ కేసులు నమోదు చేసింది. 13 మందిని అరెస్టు చేయగా.. పాకిస్తాన్‌కు చెందిన మిగతా 17 మంది పారిపోయారు. .
తొమ్మిదేళ్ల పాటు విచారణ అనంతరం ఇటీవల మోకా కోర్టు 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు చెప్పింది..
First Published:  30 Sep 2015 1:35 AM GMT
Next Story