Telugu Global
Cinema & Entertainment

చిరు 150వ చిత్రానికి ప్రముఖుల విముఖత దేనికి..?

చిరంజీవి  బొమ్మ క‌నిపిస్తే..  థియేట‌ర్స్ కిక్కిరిసేవి. ఇది గ‌తం. ప్ర‌స్తుతం  ట్రెండ్ మారింది.  ఆడియ‌న్స్ అభిరుచులు మారాయి. థియేట‌ర్ కు  వ‌చ్చే ఆడియ‌న్స్ కేట‌గిరి త‌గ్గింది.  ప్ర‌స్తుతం కాలేజ్ స్టూడెంట్సే  సినిమాకు మ‌హారాజా పోష‌కులు. వీళ్ల అభిమానుల  హీరోల లిస్ట్ లో సీనియ‌ర్ హీరోలు  త‌క్కువ‌నే చెప్పాలి.     దీనిక తోడు  చిరు  ఈ మ‌ధ్య నే  60 వ బ‌ర్త్ డే జ‌రుపుకున్నాడు. ఎన్నో మార్పులు  జ‌రిగాయి. ఇటువంటి స‌మ‌యంలో   ఒక సీనియ‌ర్ హీ రోగా  అంద‌ర్ని […]

చిరు 150వ చిత్రానికి ప్రముఖుల విముఖత దేనికి..?
X

చిరంజీవి బొమ్మ క‌నిపిస్తే.. థియేట‌ర్స్ కిక్కిరిసేవి. ఇది గ‌తం. ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. ఆడియ‌న్స్ అభిరుచులు మారాయి. థియేట‌ర్ కు వ‌చ్చే ఆడియ‌న్స్ కేట‌గిరి త‌గ్గింది. ప్ర‌స్తుతం కాలేజ్ స్టూడెంట్సే సినిమాకు మ‌హారాజా పోష‌కులు. వీళ్ల అభిమానుల హీరోల లిస్ట్ లో సీనియ‌ర్ హీరోలు త‌క్కువ‌నే చెప్పాలి. దీనిక తోడు చిరు ఈ మ‌ధ్య నే 60 వ బ‌ర్త్ డే జ‌రుపుకున్నాడు.
ఎన్నో మార్పులు జ‌రిగాయి. ఇటువంటి స‌మ‌యంలో ఒక సీనియ‌ర్ హీ రోగా అంద‌ర్ని మెప్పించే క‌థ వుంటే త‌ప్ప మెగా స్టార్ చిత్రం న‌డ‌వ‌దు. అందుకే చిరు కూడా త‌న 150 వ సినిమా విష‌యంలో ఏ విధ‌మైన తొంద‌ర ప‌డ‌కుండా.. మ్యాగ్జిమ‌మ్ క‌థ త‌ను ఆశించిన విధంగా వ‌చ్చే విధంగా ఎఫ‌ర్ట్ పెడుతున్నారు. ఈ ప్ర‌య‌త్నంలో ఈ యేడాది కొంత ఓపెన్ అప్ అయ్యి.. పూరీ జ‌గ‌న్నాధ్ కు క‌థ‌ను అప్ప చెప్పారు. అయితే పూరి చేసిన క‌థ చిరుకు పూర్తిగా న‌చ్చ‌లేదు అనేది ఇప్ప‌టికి ఒక క్లారీటి వ‌చ్చింది. ఈ విష‌యం పూరి జ‌గ‌న్నాధే స్వ‌యంగా త‌న బ‌ర్త్ డే రోజు మీడియ‌కు రీవిల్ చేశారు. సో దీంతో పూరీ జ‌గ‌న్నాధ్ .. చిరు 150 చిత్ర ద‌ర్శ‌కుడు కాద‌నే విష‌యం క్లారీటి వ‌చ్చిన‌ట్లే. మ‌రి ఎవ‌రు..? అస‌లు చిరు ఆశించిన స్థాయిలో క‌థ దొరుకుతుందా..? బాహుబ‌లికి క‌థ అందించిన విజేయంద్ర ప్ర‌సాద్ లాంటి సీనియ‌ర్ రైట‌ర్ కూడా చిరు 150 వ సినిమాకు క‌థ నావ‌ల్ల కాద‌ని త‌ప్పుకున్నారు. మ‌రి ఇటువంటి ప‌రిస్థితిలో ఎప్ప‌టికి చిరు సినిమాకు క‌థ దొరుకుతుందో..! ఎప్ప‌టికి ట్రాక్ ఎక్కుతుందో.. ఇప్ప‌ట్లో చెప్ప‌డం క‌ష్ట‌మే. ఒక్క విష‌యం మాత్రం నిజం. ఈ యేడాదికి లేన‌ట్టే మ‌రి.!

First Published:  28 Sep 2015 7:00 PM GMT
Next Story