Telugu Global
Cinema & Entertainment

ఆ విషయంలో బాహుబలిని మించిపోయిన శ్రీమంతుడు

రాజమౌళి తెరకెక్కంచిన బాహుబలి సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా థియేటర్లలోకొచ్చింది. దీంతో అంతా బాహుబలిని, శ్రీమంతుడ్ని కంపేర్ చేయడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 6వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. శ్రీమంతుడు సినిమా ఆ రేంజ్ ను అందుకోలేకపోయినప్పటికీ.. చాలా అంశాల్లో బాహుబలికి గట్టిపోటీనిచ్చింది. మహేష్ స్టామినాను బాహుబలికి రుచిచూపించింది శ్రీమంతుడు సినిమా. విడుదలైన తర్వాత కొన్ని ఏరియాల్లో వసూళ్ల పరంగా బాహుబలి కంటే శ్రీమంతుడే బెస్ట్ అని […]

ఆ విషయంలో బాహుబలిని మించిపోయిన శ్రీమంతుడు
X
రాజమౌళి తెరకెక్కంచిన బాహుబలి సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా థియేటర్లలోకొచ్చింది. దీంతో అంతా బాహుబలిని, శ్రీమంతుడ్ని కంపేర్ చేయడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 6వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. శ్రీమంతుడు సినిమా ఆ రేంజ్ ను అందుకోలేకపోయినప్పటికీ.. చాలా అంశాల్లో బాహుబలికి గట్టిపోటీనిచ్చింది. మహేష్ స్టామినాను బాహుబలికి రుచిచూపించింది శ్రీమంతుడు సినిమా. విడుదలైన తర్వాత కొన్ని ఏరియాల్లో వసూళ్ల పరంగా బాహుబలి కంటే శ్రీమంతుడే బెస్ట్ అని నిరూపించుకుంది. తాజాగా ఫిఫ్టీ డేట్ సెగ్మెంట్ లో కూడా మహేషే పైచేయి సాధించాడు. రీసెంట్ గా 50 రోజులు పూర్తిచేసుకుంది శ్రీమంతుడు సినిమా. దాదాపు 185 సెంటర్లలో ఈ సినిమా ఫిఫ్టీ డేట్ కంప్లీట్ చేసుకుంది. అదే బాహుబలి సినిమా విషయానికొస్తే ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించినప్పటికీ.. పట్టుమని 100 సెంటర్లలో కూడా 50 రోజులు ఆడలేదు. ఈ విషయంలో బాహుబలిని మించిపోయాడు శ్రీమంతుడు.
First Published:  28 Sep 2015 10:00 PM GMT
Next Story