కమల్ హాసన్ అందుకే అవకాశం ఇచ్చాడు..!
ఒక నూతన డైరెక్టర్ కు కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్ అవకాశం ఇవ్వడం సౌత్ లో ఒక పెద్ద డెబేట్ అయింది. కమల్ హాసన్ వంటి నేషనల్ స్టార్ ను .. కొత్త దర్శకుడు ఎలా డైరెక్ట్ చేయగలుగుతాడనే సందేహాం సర్వత్రా రేకెత్తింది. కట్ చేస్తే.. ఈ అనుమానులకు కమల్ హాసన్ చీకటిరాజ్యం సినిమా ట్రైలర్ వేడుకల్లో ఒక క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు ఈ నూతన దర్శకుడు రాజేష్ సెల్వన్. […]
BY admin29 Sept 2015 12:00 AM GMT
X
admin Updated On: 29 Sept 2015 4:06 AM GMT
ఒక నూతన డైరెక్టర్ కు కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్ అవకాశం ఇవ్వడం సౌత్ లో ఒక పెద్ద డెబేట్ అయింది. కమల్ హాసన్ వంటి నేషనల్ స్టార్ ను .. కొత్త దర్శకుడు ఎలా డైరెక్ట్ చేయగలుగుతాడనే సందేహాం సర్వత్రా రేకెత్తింది. కట్ చేస్తే.. ఈ అనుమానులకు కమల్ హాసన్ చీకటిరాజ్యం సినిమా ట్రైలర్ వేడుకల్లో ఒక క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్ ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారు ఈ నూతన దర్శకుడు రాజేష్ సెల్వన్.
వాస్తవంగా కమల్ హాసన్ తనకు తెలియని వ్యక్తి స్టోరీ ఎంత గొప్పగా చెప్పినా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చేవారు కాదేమో ..కానీ.. ఈ రాజేష్ సెల్వన్ కమల్ కు ప్రియ శిష్యుడు. కమల్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు పని చేశారు. ఈ యేడున్నర సంవత్సరాల పాటు..కమల్ హాసన్ చేసిన ప్రతి సినిమాకు వర్క్ చేశాడు. ఇలా చేస్తూ కమల్ హాసన్ మనసును దోచుకున్నాడు. చీకటి రాజ్యం కథ కు సంబంధించి .. కథ అంతా సిద్దం అయిన తరువాత ..కమల్ .. రాజేష్ సెల్వన్ ను పిలిచి.. ఈ సినిమాకు డైరెక్టర్ మీరే అని చెప్పారట. అప్పటి వరకు రాజేష్..ఈ కొత్త సినిమాకి కూడా విశ్వరూపం సినిమాకు వర్క్ చేసినట్లే ..తను కూడా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఒక్క మెంబర్ ను మాత్రమే అనుకున్నారట. కట్ చేస్తే.. ఇలా జాక్ పాట్ తగిలి దర్శకుడైపోయాడు. సో చీకటి రాజ్యం డైరెక్టర్ ఆడియన్స్ కు కొత్తేమోగాని .. .కమల్ సార్ కు మాత్రం కొత్త కాదు. అతని పనితనం బాగా తెలిసిన వ్యక్తి. ఈ చిత్రం నవంబర్ మొదటి వారంలో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారట.
Next Story