Telugu Global
Others

వరంగల్ లోక్‌సభకు వామపక్ష అభ్యర్థిగా గాలి వినోద్‌

త్వరలో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని వామపక్షాలు ప్రకటించాయి. ఇంకా ఎన్నికల తేదీ వెలువడక పోయినప్పటికీ ఇప్పటి నుంచే ఈ స్థానంపై అన్ని రాజకీయపక్షాలు కన్నేశాయి. ఇందులో భాగంగా ముందుగా వామపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. నిజానికి ఈ స్థానం నుంచి వామపక్షాల అభ్యర్ధిగా ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీ వామపక్ష నాయకులు భావించారు. కాని ఆయన పోటీకి నిరాకరించడంతో ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ ఉప ఎన్నికల్లో వామపక్షాల తరపున బరిలోకి దిగుతారని […]

త్వరలో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని వామపక్షాలు ప్రకటించాయి. ఇంకా ఎన్నికల తేదీ వెలువడక పోయినప్పటికీ ఇప్పటి నుంచే ఈ స్థానంపై అన్ని రాజకీయపక్షాలు కన్నేశాయి. ఇందులో భాగంగా ముందుగా వామపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించాయి. నిజానికి ఈ స్థానం నుంచి వామపక్షాల అభ్యర్ధిగా ప్రజాగాయకుడు గద్దర్‌ పోటీ వామపక్ష నాయకులు భావించారు. కాని ఆయన పోటీకి నిరాకరించడంతో ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ ఉప ఎన్నికల్లో వామపక్షాల తరపున బరిలోకి దిగుతారని వెల్లడించాయి. డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వరంగల్‌ అభ్యర్థిగా ప్రొ. గాలి వినోద్‌కుమార్ పేరును ప్రతిపాదించారు. అనంతరం జరిగిన సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ… టీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పౌరహక్కులను హరించివేస్తోందన్నారు. పౌరహక్కులను వామపక్షాలే కాపాడాలన్నారు. కాగా… వామపక్షాల అభ్యర్ధిగా ఎంపికైన ప్రొ. వినోద్‌కుమార్ బషీర్‌బాగ్ లా కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు.

First Published:  28 Sep 2015 1:14 PM GMT
Next Story