Telugu Global
Others

బాధిత రైతుల్ని ఆదుకోండి: బీజేపీ నేత లక్ష్మణ్‌

నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంతోపాటు వీటిని సరఫరా చేసిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సభా పక్ష నేత లక్ష్మణ్‌ డిమాండు చేశారు. వరిసాగు సగానికి పైగా తగ్గిపోయిందని, పంటల విస్తీర్ణం కూడా ఇదే నిష్పత్తిలో ఉందని తెలిపారు. కరువు మండలాలు ప్రకటించి ఉంటే ఆత్మహత్యలు ఉండేవి కావని లక్ష్మణ్‌ అన్నారు. దీనివల్ల రైతులకు ఊరట కలిగి ఉండేదని, ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే కేంద్రం అందించే సాయాన్ని తీసుకోవచ్చని ఆయన […]

నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడంతోపాటు వీటిని సరఫరా చేసిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సభా పక్ష నేత లక్ష్మణ్‌ డిమాండు చేశారు.

వరిసాగు సగానికి పైగా తగ్గిపోయిందని, పంటల విస్తీర్ణం కూడా ఇదే నిష్పత్తిలో ఉందని తెలిపారు. కరువు మండలాలు ప్రకటించి ఉంటే ఆత్మహత్యలు ఉండేవి కావని లక్ష్మణ్‌ అన్నారు. దీనివల్ల రైతులకు ఊరట కలిగి ఉండేదని, ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందిస్తే కేంద్రం అందించే సాయాన్ని తీసుకోవచ్చని ఆయన అన్నారు. గ్రాసం కొరతతో పశువులు కబేళాలకు తరలిపోతున్నాయని, ఇది చాలా బాధాకరమని అన్నారు. రుణ మాఫీ చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని, వాయిదా పద్ధతిలో రుణ మాఫీ చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలగలేదని, ప్రభుత్వం చిత్తశుద్దితో మేలు చేయాలని చూసినా బ్యాంకుల వైఖరి వల్ల అన్నదాతకు భరోసా లభించలేదని లక్ష్మణ్‌ అన్నారు. ధనిక రాష్ట్రంలో ఉన్నా రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం బాధ కలిగిస్తుందని, ఇప్పటికే రుణ మాఫీ సగానికి జరిగినట్టు ప్రభుత్వం చెబుతోందని, ఇప్పటికైనా మిగిలిన 50 శాతాన్ని ఒకేసారి చెల్లించి రైతులకు భరోసా కల్పించాలని లక్ష్మణ్‌ కోరారు. రైతులకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలను అనువర్తింపజేస్తే వారు కోలుకోవడానికి వీలవుతుందని, అన్నదాత భూముల పరీక్షకు భూసార కార్డులు, ఆరోగ్య పరీక్షలకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలని ఆయన సూచించారు.

First Published:  28 Sep 2015 1:18 PM GMT
Next Story