Telugu Global
Cinema & Entertainment

మెగా అభిమానులకు ఓవైపు ఆశ... మరోవైపు నిరాశ!

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ ఇప్పుడప్పుడే ఫలించేట్టుగా లేదు. ఇంకా దీనికి సంబంధించిన కథే ఫైనలైజ్‌ కాలేదు. అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి దర్శకుడిగా పూరి జగన్నాథ్‌ పేరు మీడియాకెక్కినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాదని తేల్చేశాయి. ఇపుడు కథా లేదు… డైరెక్టరూ లేడు. సరిగ్గా ఇదే సమయంలో మెగాస్టార్‌ సినిమా కోసం పరితపిస్తున్న అభిమానులకు షాకిచ్చే న్యూస్‌ ఒకటి బయటపడి కళ్ళు […]

మెగా అభిమానులకు ఓవైపు ఆశ... మరోవైపు నిరాశ!
X

మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ ఇప్పుడప్పుడే ఫలించేట్టుగా లేదు. ఇంకా దీనికి సంబంధించిన కథే ఫైనలైజ్‌ కాలేదు. అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి దర్శకుడిగా పూరి జగన్నాథ్‌ పేరు మీడియాకెక్కినా ఆ తర్వాత జరిగిన పరిణామాలు కాదని తేల్చేశాయి. ఇపుడు కథా లేదు… డైరెక్టరూ లేడు. సరిగ్గా ఇదే సమయంలో మెగాస్టార్‌ సినిమా కోసం పరితపిస్తున్న అభిమానులకు షాకిచ్చే న్యూస్‌ ఒకటి బయటపడి కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ ఫ్యామిలీ నుంచి ఎవరొచ్చినా దండలేస్తూ… అండగా ఉంటున్న మెగా అభిమానులకు ఆ ఇంటి నుంచి ఓ హీరోయిన్‌ వస్తుందన్న ప్రకటన విని తలలెక్కడో పెట్టేసుకున్నారు. అందం, అభినయం పక్కన పెడితే అసలు మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌ రావడమేంటి… అంటూ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

ఇంట్లో బుద్ధిగా ఉండాల్సిన అమ్మాయి తెరమీదకి రావడం ఏమిటి? స్టెప్పులేయడం ఏమిటి? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నాగబాబు తనయ నిహారిక విషయంలో మెగా ఫ్యామిలీ అభిమానులంతా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది అభిమానులు నిహారిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీని సహించలేక పోతున్నారు. నేరుగానే మెగా కాంపౌండ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. హీరోలు వచ్చినట్టు హీరోయిన్లు వస్తే సహించలేరు అభిమానులు. గతంలో ఇలాంటి సన్నివేశాలు చాలానే జరిగాయి. అక్కినేని కాంపౌండ్ నుంచి సుప్రియ హీరోయిన్‌గా వస్తే నాగ్ అభిమానులు నానా యాగీ చేశారు. కృష్ణ కూతురు మంజుల డీసెంట్ పాత్రలతో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చినప్పుడు కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ప్రత్యక్ష విమర్శలకు దిగారు. మరి నిహారికకు సంబంధించి మెగా కాంపౌండ్‌పై వస్తున్న విమర్శల్ని ఆ హీరోలు స్వీకరించి ఎంతవరకు ఆదరిస్తారో వేచి చూడాలి.

First Published:  29 Sep 2015 1:31 AM GMT
Next Story