Telugu Global
CRIME

హైదరాబాద్‌లో ఒక్కరోజే 6 చైన్‌ స్నాచింగ్‌లు

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలనే లక్ష్యం చేసుకుని దుండగులు బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. నగరంలో ఇవాళ ఒక్క రోజే ఆరు చోట్ల చైన్ స్నాచర్లు దొంగతనాలకు పాల్పడ్డారు. గతంలో దొంగలు చైన్‌ స్నాచింగ్‌కు నిర్మానుష్య ప్రదేశాలను ఎంచుకునేవారు. ఇపుడు ఏకంగా జనసమర్ధంగా ఉన్న ప్రాంతాల్లో సైతం భయం లేకుండా స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీలో మహిళ మెడ నుంచి మూడు తులాలు, కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీలో నాలుగు తులాలు, ఎస్‌.ఆర్‌.నగర్‌లో […]

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలనే లక్ష్యం చేసుకుని దుండగులు బంగారు గొలుసులను లాక్కెళ్తున్నారు. నగరంలో ఇవాళ ఒక్క రోజే ఆరు చోట్ల చైన్ స్నాచర్లు దొంగతనాలకు పాల్పడ్డారు. గతంలో దొంగలు చైన్‌ స్నాచింగ్‌కు నిర్మానుష్య ప్రదేశాలను ఎంచుకునేవారు. ఇపుడు ఏకంగా జనసమర్ధంగా ఉన్న ప్రాంతాల్లో సైతం భయం లేకుండా స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీలో మహిళ మెడ నుంచి మూడు తులాలు, కేపీహెచ్‌బీ ధర్మారెడ్డి కాలనీలో నాలుగు తులాలు, ఎస్‌.ఆర్‌.నగర్‌లో అంగన్‌వాడీ వర్కర్ అంబిక మెడలో నాలుగు తులాలు, ఫిల్మ్‌నగర్‌లో మహిళ మెడలోంచి రెండు తులాలు, చిక్కడపల్లిలో మహిళ మెడలోంచి 9 తులాలు, సనత్‌నగర్‌లో మహిళ మెడ నుంచి 7 తులాల బంగారు గొలుసులను దుండగులు లాక్కుపోయారు. బాధితులకు గాయాలు కావడంతో వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యధావిధిగా పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story