Telugu Global
Cinema & Entertainment

అమెరికాలో సెలబ్రేట్ చేసుకున్న భలే మగాడు

నాని, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన భలేభలే మగాడివోయ్ సినిమా అనూహ్య విజయం సాధించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అందుకే ఈ చిత్ర విజయోత్సవాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఏకంగా అమెరికాలోనే సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. సినిమా దిగ్విజయంగా పాతిక రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురష్కరించుకొని, అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సినిమా యూనిట్ పర్యటించింది. అక్కడ తెలుగువారితో మాట్లాడింది. భలే […]

అమెరికాలో సెలబ్రేట్ చేసుకున్న భలే మగాడు
X
నాని, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన భలేభలే మగాడివోయ్ సినిమా అనూహ్య విజయం సాధించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అందుకే ఈ చిత్ర విజయోత్సవాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఏకంగా అమెరికాలోనే సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. సినిమా దిగ్విజయంగా పాతిక రోజులు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురష్కరించుకొని, అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సినిమా యూనిట్ పర్యటించింది. అక్కడ తెలుగువారితో మాట్లాడింది. భలే భలే మగాడివోయ్ సక్సెస్ ను వాళ్లతో సంబరంగా జరుపుకుంది. ఈ సినిమా వసూళ్ల బాగా పెరగడానికి కారణం ఓవర్సీస్ కలెక్షన్లే. అందుకే సినిమా యూనిట్ ఇలా ప్లాన్ చేసింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు ఇప్పటివరకు 1.4 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్ వచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు.
First Published:  29 Sep 2015 1:30 AM GMT
Next Story