Telugu Global
Cinema & Entertainment

బెంగాల్ టైగర్ దూసుకొస్తున్నాడు

రవితేజ-రాశిఖన్నా-తమన్న నటిస్తున్న చిత్రం బెంగాల్ టైగర్. సంపత్ నంది దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్స్ ఇటీవలే విడుదల చేశారు. పోస్టర్లతో పాటు సినిమాలో హీరోహీరోయిన్ల పాత్రల పేర్లను కూడా ప్రకటించారు. తాజాగా సినిమాకు సంబంధించి విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 5న బెంగాల్ టైగర్ ను థియేటర్లలోకి దించాలని ఫిక్స్ అయ్యాడు మాస్ రాజా. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటల్ని అక్టోబర్ […]

బెంగాల్ టైగర్ దూసుకొస్తున్నాడు
X
రవితేజ-రాశిఖన్నా-తమన్న నటిస్తున్న చిత్రం బెంగాల్ టైగర్. సంపత్ నంది దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్స్ ఇటీవలే విడుదల చేశారు. పోస్టర్లతో పాటు సినిమాలో హీరోహీరోయిన్ల పాత్రల పేర్లను కూడా ప్రకటించారు. తాజాగా సినిమాకు సంబంధించి విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 5న బెంగాల్ టైగర్ ను థియేటర్లలోకి దించాలని ఫిక్స్ అయ్యాడు మాస్ రాజా. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటల్ని అక్టోబర్ రెండో వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్ టైగర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. రవితేజ, తమన్న, రాశిఖన్నా పోర్షన్లకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దీంతో ఎడిటింగ్, డబ్బింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి.. అక్టోబర్ మూడోవారం నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాతో కిక్-2 గాయాల్ని మరిచిపోవాలని భావిస్తున్నాడు మాస్ రాజా.
First Published:  29 Sep 2015 7:00 AM GMT
Next Story