Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కోసం సూపర్ స్టార్లు క్యూ 

తన సినిమా ప్రమోషన్ కు సంబంధించి ప్రతి ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు అఖిల్. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. ఓవర్సీస్, కోలీవుడ్ కూడా కవర్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న అమెరికాలో అఖిల్ సినిమా ఆడియోను గ్రాండ్ గా విడుదల చేశారు. తర్వాత మలేషియా వెళ్లి అక్కడ కూడా అఖిల్ సినిమా పాటల్ని అట్టహాసంగావిడుదల చేశారు. ఇప్పుడు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు అఖిల్. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులు మీదుగా అఖిల్ […]

అఖిల్ కోసం సూపర్ స్టార్లు క్యూ 
X
తన సినిమా ప్రమోషన్ కు సంబంధించి ప్రతి ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాడు అఖిల్. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. ఓవర్సీస్, కోలీవుడ్ కూడా కవర్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న అమెరికాలో అఖిల్ సినిమా ఆడియోను గ్రాండ్ గా విడుదల చేశారు. తర్వాత మలేషియా వెళ్లి అక్కడ కూడా అఖిల్ సినిమా పాటల్ని అట్టహాసంగావిడుదల చేశారు. ఇప్పుడు కోలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు అఖిల్. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చేతులు మీదుగా అఖిల్ సినిమా పాటల్ని విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా పాటల్నిమన సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేస్తే.. తమిళనాట ఈ పాటల్ని రజనీకాంత్ విడుదల చేయడం విశేషం. ఇక ఫస్ట్ ట్రయిలర్ ను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ విడుదల చేస్తే.. మరో సూపర్ స్టార్ అమితాబ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇలా సూపర్ స్టార్స్ అందర్నీ తన సినిమా కోసం వాడేసుకుంటున్నాడు అఖిల్. అక్టోబర్ 22న విడుదల కానున్న తన మొట్టమొదటి సినిమాతో తాను కూడా సూపర్ స్టార్ అయిపోవాలని కలలుకంటున్నాడు సిసింద్రీ అఖిల్.
Next Story