Telugu Global
Cinema & Entertainment

సాహసమే శ్వాస అంటున్న చైతూ

ఏం మాయ చేసావే తర్వాత ఆ స్థాయిలో మళ్లీ సక్సెస్ అందుకునేందుకు మరోసారి గౌతమ్ మీనన్ టీంతో కలిసి వర్క్ చేశాడు నాగచైతన్య. అదే సాహసం శ్వాసగా సాగిపో. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తుంటే.. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. నాగచైతన్యకు సంబంధించి 2 సినిమాలకు రెహ్మాన్ సంగీతం అందించడం విశేషం. ఇప్పుడీ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు నాగచైతన్య. ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోయిన చైతూ, గౌతమ్-రెహ్మాన్ కాంబోపైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఎన్నో […]

సాహసమే శ్వాస అంటున్న చైతూ
X
ఏం మాయ చేసావే తర్వాత ఆ స్థాయిలో మళ్లీ సక్సెస్ అందుకునేందుకు మరోసారి గౌతమ్ మీనన్ టీంతో కలిసి వర్క్ చేశాడు నాగచైతన్య. అదే సాహసం శ్వాసగా సాగిపో. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తుంటే.. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. నాగచైతన్యకు సంబంధించి 2 సినిమాలకు రెహ్మాన్ సంగీతం అందించడం విశేషం. ఇప్పుడీ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు నాగచైతన్య. ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోయిన చైతూ, గౌతమ్-రెహ్మాన్ కాంబోపైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన దోచెయ్ సినిమా అంతగా ఆడకపోవడంతో ఈసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను ఎంచుకున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన విడుదల తేదీల్ని ఫిక్స్ చేశారు. సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. వచ్చేనెల రెండోవారంలో ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. త్వరలోనే తేదీలకు సంబంధించి అధికారికంగా ప్రకటన రాబోతోంది.
Next Story