Telugu Global
NEWS

రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి : రఘువీరా

ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏపీ ‌‌పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని మండిపడ్డారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఇలా ఆత్మహత్యలకు పాల్పడడాన్ని ప్రభుత్వాలు ఆపాలని, వారికి భరోసా కల్పించాలని ఆయన డిమాండు చేశారు. రైతులకు సబ్సిడీ, రుణమాఫీ అందడం లేదన్న రఘువీరా దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత ఆత్మహత్యలతోపాటు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా […]

రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి : రఘువీరా
X
ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఏపీ ‌‌పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని మండిపడ్డారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఇలా ఆత్మహత్యలకు పాల్పడడాన్ని ప్రభుత్వాలు ఆపాలని, వారికి భరోసా కల్పించాలని ఆయన డిమాండు చేశారు. రైతులకు సబ్సిడీ, రుణమాఫీ అందడం లేదన్న రఘువీరా దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత ఆత్మహత్యలతోపాటు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని ఆరోపించారు. మంత్రి నారాయణకు చెందిన కాలేజీల్లోనే 15 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఇదే మరెవరి కాలేజీల్లో అయినా అయితే ఈ ప్రభుత్వం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు.
First Published:  28 Sep 2015 2:19 AM GMT
Next Story