Telugu Global
Cinema & Entertainment

చీక‌టి రాజ్యం  సినిమా కాపీ క్యాట్‌..! 

లాంగ్వేజ్ ఏదైనా..  ఎత్తుడు దింపుడు కార్య‌క్ర‌మాం లేకుండా  ఇత‌ర లాంగ్వేజెస్ లో సినిమా నిర్మాణం ఉండ‌దు.  హాలీవుడ్ వాళ్లు సృష్టిస్తారు. మిగిలిన వాళ్లు ఫాలో అవుతారు అనే నానుడి    రెస్ట్ ఆఫ్ ది  ఫిల్మ్ వాల్డ్ బాగా ఫాలో అవుతుంది. ఇక మ‌న ద‌క్షిణాది ద‌ర్శ‌కులు.. హాలీవుడ్ సినిమా ప్రేర‌ణ లేకుండా  క‌థ త‌యారు చేసుకోలేరు.   ముర‌గ దాస్ నుంచి ..రాజ‌మౌళి వ‌ర‌కు అంతా  ఎవ‌రి స్థాయికి వాళ్లు ప్రేర‌ణ పొందుతుంటారు.  క‌ట్ చేస్తే..తాజాగా   క‌మ‌ల్ హాస‌న్ […]

చీక‌టి రాజ్యం  సినిమా కాపీ క్యాట్‌..! 
X

లాంగ్వేజ్ ఏదైనా.. ఎత్తుడు దింపుడు కార్య‌క్ర‌మాం లేకుండా ఇత‌ర లాంగ్వేజెస్ లో సినిమా నిర్మాణం ఉండ‌దు. హాలీవుడ్ వాళ్లు సృష్టిస్తారు. మిగిలిన వాళ్లు ఫాలో అవుతారు అనే నానుడి రెస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ వాల్డ్ బాగా ఫాలో అవుతుంది. ఇక మ‌న ద‌క్షిణాది ద‌ర్శ‌కులు.. హాలీవుడ్ సినిమా ప్రేర‌ణ లేకుండా క‌థ త‌యారు చేసుకోలేరు. ముర‌గ దాస్ నుంచి ..రాజ‌మౌళి వ‌ర‌కు అంతా ఎవ‌రి స్థాయికి వాళ్లు ప్రేర‌ణ పొందుతుంటారు.

క‌ట్ చేస్తే..తాజాగా క‌మ‌ల్ హాస‌న్ తో చీక‌టి రాజ్యం చేస్తున్న త‌మిళ ద‌ర్శకుడు ఈ సినిమా మెయిన్ స్టోరి పాయింట్ ను 2011 లో రిలీజ్ అయిన స్లీప్ లెస్ నెట్స్ అనే ఒక హాలీవుడ్ ఫిల్మ్ నుంచి ఎత్తి న‌ట్లు టాక్. స్లీప్ లెస్ నెట్స్ లో ఒక క‌రెప్టెడ్ పోలీసాఫిస‌ర్ కు ..ఒక మాఫియా డాన్ కు మ‌ధ్య టామ్ అండ్ జెర్రి మాదిరి జరిగే స్టోరి పాయింట్. అవినీతి ప‌రుడైన పోలీసాఫిస‌ర్ కు ..ఒక మాఫియి డాన్ కు చెందిన కొకైయిన్ బ్యాగ్ ప‌ట్టు ప‌డుతుంది. కోట్లాది రూపాయ‌ల మ‌త్తు మందు బ్యాగ్ ప‌ట్టు ప‌డ‌టంతో.. పోలీసాఫ‌స‌ర్ ను తిరిగి ఇవ్వ‌మ‌ని కొర‌తాడు. కానీ పోలీసాఫిస‌ర్ ఇవ్వ‌డు. దీంతో ఆ మాఫియా డాన్ .. పోలీసాఫిస‌ర్ 12 ఏళ్ల కొడుకుని కిడ్నాప్ చేయిస్తాడు. త‌న కొకైయిన్ బ్యాగ్ ఇస్తేనే .. కొడుకుని సేఫ్ గా అప్ప చెబుతాన‌ని చెబుతాడు. అయితే ఆ మాఫియి డాన్ కు చెందిన మత్తు ప‌దార్ధపు బ్యాగ్ నాశ‌నం అవుతుంది. మ‌రి చివర‌కు పోలీసాఫ‌స‌ర్ కొడుకు ను డాన్ ఎం చేశాడు..? కొడుకుని ర‌క్షించుకోవ‌డానికి పోలీసాఫిసర్ ఏం చేశాడు.? పిల్ల‌వాడు సేఫ్ గా తండ్రిని రీచ్ అయ్యాడా..? అనేది స్లీప్ లెస్ నైట్స్ ప్లాట్. ఇదే పాయింట్ ను కొద్ది పాటి మార్పుల‌తో క‌మ‌ల్ హాస‌న్, త్రిష లీడ్ రోల్స్ లో వ‌స్తున్న చీక‌టి రాజ్యం చిత్రం చేస్తున్న‌ట్లు టాక్. మ‌రి దీనికి సంబంధించి.. చీక‌టి రాజ్యం ద‌ర్శ‌కుడు ఏమంటాడో.. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Next Story