Telugu Global
Cinema & Entertainment

అలా మొదలైంది అంటున్న జాదుగాడు

జాదుగాడు అనగానే మనకు గుర్తొచ్చే పేరు నాగశౌర్య. అలా మొదలైంది సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే దర్శకురాలు నందినీ రెడ్డి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. నిన్నగాక మొన్న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అప్పుడే క్లయిమాక్స్ కు వచ్చింది. ఈ సినిమాకు కల్యాణ వైభోగమే అనే పేరుపెట్టారు. మాళవికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. అక్కడ అందమైన లొకేషన్లో హీరోహీరోయిన్ల మధ్య చిట్టచివరి […]

అలా మొదలైంది అంటున్న జాదుగాడు
X
జాదుగాడు అనగానే మనకు గుర్తొచ్చే పేరు నాగశౌర్య. అలా మొదలైంది సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే దర్శకురాలు నందినీ రెడ్డి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. నిన్నగాక మొన్న ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అప్పుడే క్లయిమాక్స్ కు వచ్చింది. ఈ సినిమాకు కల్యాణ వైభోగమే అనే పేరుపెట్టారు. మాళవికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది. అక్కడ అందమైన లొకేషన్లో హీరోహీరోయిన్ల మధ్య చిట్టచివరి పాట పిక్చరైజ్ చేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలా మొదలైంది లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన రంజిత్ మూవీస్ బ్యానర్ పై కెఎస్ దామోదర ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కల్యాణ వైభోగమే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది నందినీరెడ్డి. అటు నాగశౌర్యకు కూడా ఓ హిట్ చాలా అవసరం.
First Published:  26 Sep 2015 10:16 PM GMT
Next Story