Telugu Global
Cinema & Entertainment

శ్రీ‌మంతుడిగా  హృతిక్ రోష‌న్..!

బాలీవుడ్ మేచోమెన్ గా పేరొందిన   హృతిక్ రోష‌న్  త్వ‌ర‌లో శ్రీ‌మంతుడిగా  రాబోతున్నాడా..?  గ్రామాల్ని ద‌త్త‌తు తీసుకోవ‌డం కాన్సెప్ట్ తో వ‌చ్చిన   మ‌హేష్ బాబు న‌టించిన శ్రీ‌మంతుడు .. తెలుగు నాట  ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాను  హ‌క్కుల్ని  సొ్ంతం చేసుకున్న  ఎరోస్ ఇంట‌ర్నేష‌నల్ సంస్థ వారు .. శ్రీ‌మంతుడు సినిమాను  హిందిలో   హృతిక్ రోష‌న్  హీరోగా   రీమేక్ చేయ‌డానికి  రంగం సిద్దం చేస్తున్నారని వినికిడి. ఈ సినిమాను  అల్రేడి  హృతిక్ చేసి కొన్ని మార్పులు చేర్పులు […]

శ్రీ‌మంతుడిగా  హృతిక్ రోష‌న్..!
X

బాలీవుడ్ మేచోమెన్ గా పేరొందిన హృతిక్ రోష‌న్ త్వ‌ర‌లో శ్రీ‌మంతుడిగా రాబోతున్నాడా..? గ్రామాల్ని ద‌త్త‌తు తీసుకోవ‌డం కాన్సెప్ట్ తో వ‌చ్చిన మ‌హేష్ బాబు న‌టించిన శ్రీ‌మంతుడు .. తెలుగు నాట ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాను హ‌క్కుల్ని సొ్ంతం చేసుకున్న ఎరోస్ ఇంట‌ర్నేష‌నల్ సంస్థ వారు .. శ్రీ‌మంతుడు సినిమాను హిందిలో హృతిక్ రోష‌న్ హీరోగా రీమేక్ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారని వినికిడి. ఈ సినిమాను అల్రేడి హృతిక్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసిన‌ట్లు తెలుస్తుంది.

ప్ర‌స్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో క‌రువు తాండ‌విస్తుంది. ఇటువంటి స‌మ‌యంలో ఈ సినిమా హిందిలో హృతిక్ వంటి హీరో తో చేసి రిలీజ్ చేస్తే.. కొన్ని గ్రామాల్ని ద‌త్త‌తు తీసుకోవ‌డానికి ప్ర‌వాస భార‌తీయులు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆశిస్తున్నారు. అందుకే రీమేక్ కు సంబంధించిన ప‌నులు వేగ వంతం చేస్తున్నారు.మొత్తం మీద శ్రీ‌మంతుడు ఒక అర్ధ‌వంత‌మైన చిత్రంగా అంద‌రి అభిమానుం చూర‌గొన‌డం విశేషం. ఇక హిందిలో కూడా ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్టే చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్. అన్ని క‌లిసొస్తే త్వ‌ర‌లో ఆ వార్త బ‌య‌ట‌కు రావోచ్చు మ‌రి…!

Next Story