Telugu Global
Cinema & Entertainment

కన్నెర్ర చేసిన మెగాస్టార్

మెగాభిమానులు ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి మేకప్ వేసుకున్నాడు. కెమెరా ముందుకొచ్చాడు. యాక్షన్ అనగానే కన్నెర్రజేశాడు. విలన్స్ ను చితక్కొట్టాడు. అవును.. చిరంజీవి బ్రూస్ లీ సెట్స్ పైకి వచ్చాడు. ప్రస్తుతం మెగాస్టార్ తో ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. 15 నిమిషాల తన ఎప్పీయరెన్స్ కోసం 3 రోజులు కాల్షీట్లు ఇచ్చాడు చిరు. ఈరోజు, రేపు, ఎల్లుండి చిరంజీవితో షూటింగ్ ఉంటుంది. ఈ 3 రోజుల్లో కొన్ని సన్నివేశాలతో పాటు ఒక ఫైట్, […]

కన్నెర్ర చేసిన మెగాస్టార్
X

మెగాభిమానులు ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి మేకప్ వేసుకున్నాడు. కెమెరా ముందుకొచ్చాడు. యాక్షన్ అనగానే కన్నెర్రజేశాడు. విలన్స్ ను చితక్కొట్టాడు. అవును.. చిరంజీవి బ్రూస్ లీ సెట్స్ పైకి వచ్చాడు. ప్రస్తుతం మెగాస్టార్ తో ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. 15 నిమిషాల తన ఎప్పీయరెన్స్ కోసం 3 రోజులు కాల్షీట్లు ఇచ్చాడు చిరు. ఈరోజు, రేపు, ఎల్లుండి చిరంజీవితో షూటింగ్ ఉంటుంది. ఈ 3 రోజుల్లో కొన్ని సన్నివేశాలతో పాటు ఒక ఫైట్, ఒక సాంగ్ పిక్చరైజ్ చేయాలి. ప్రస్తుతం ఈ పనిమీదే బిజీగా ఉన్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. మరోవైపు చిరంజీవితో పాటు తనయుడు చెర్రీ కూడా రెడీగా ఉన్నాడు. చిరంజీవి-చరణ్ మధ్య వచ్చే సన్నివేశాల్ని ఎల్లుండి పిక్చరైజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో బ్రూస్ లీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 2న ఈ సినిమా పాటల్ని గ్రాండ్ గా విడుదల చేస్తారు.

First Published:  26 Sep 2015 8:00 PM GMT
Next Story