Telugu Global
CRIME

హజ్ విషాదంలో భారతీయ మృతులు 35

పవిత్ర హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో భారత మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఏడుగురు ఇండియన్లు చనిపోయినట్లు హజ్ కమిటీ ప్రకటించగా తాజాగా మరో ఆరుగురు కూడా మృతి చెందినట్లు వెల్లడించింది. ఈ 13 మందిలో ఐదుగురు కేరళకు చెందిన వారు కాగా మరో నలుగురు గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముస్లింలు ఉన్నారు. జార్ఖండ్‌‌కు చెందిన ఇద్దరు, యూపీ, బీహార్ కు చెందిన వారు ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో ఈ మహా విషాదంలో భారతీయ మృతుల సంఖ్య […]

పవిత్ర హజ్ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో భారత మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఏడుగురు ఇండియన్లు చనిపోయినట్లు హజ్ కమిటీ ప్రకటించగా తాజాగా మరో ఆరుగురు కూడా మృతి చెందినట్లు వెల్లడించింది. ఈ 13 మందిలో ఐదుగురు కేరళకు చెందిన వారు కాగా మరో నలుగురు గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముస్లింలు ఉన్నారు. జార్ఖండ్‌‌కు చెందిన ఇద్దరు, యూపీ, బీహార్ కు చెందిన వారు ఒక్కొక్కరు చనిపోయారు. దీంతో ఈ మహా విషాదంలో భారతీయ మృతుల సంఖ్య 35కి చేరింది. ఈ విషాద ఘటనలో ఇప్పటివరకు 769 మంది చనిపోగా 934 మంది గాయపడ్డారు.

Next Story