Telugu Global
CRIME

అలహాబాద్‌లో మేథా పాట్కర్‌ అరెస్ట్‌

భూ సేకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యమకారుల కుటుంబాలతో సమావేశమవడానికి, సామాజిక కార్యకర్త భన్వరీలాల్‌ శర్మ వర్ధంతిలో పాల్గొనడానికి వెళుతున్న సామాజిక కార్యకర్త మేథా పాట్కర్‌ను అలహాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించి  ఆ ప్రాంతానికి వెళ్ళవద్దని అలహాబాద్‌ కలెక్టర్‌ ఇచ్చిన సూచనను ఆమె పాటించక పోవడంతో ఈ అరెస్టు తప్పనిసరైందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అలహాబాద్‌ యూనివర్శిటీ అతిధి గృహంలో ఆమెను నిర్భంధించినట్టు తెలిసింది. భూ సేకరణను అడ్డుకుంటున్నవారికి అండగా నిలబడేందుకు తనను విడుదల […]

అలహాబాద్‌లో మేథా పాట్కర్‌ అరెస్ట్‌
X
భూ సేకరణను వ్యతిరేకిస్తున్న ఉద్యమకారుల కుటుంబాలతో సమావేశమవడానికి, సామాజిక కార్యకర్త భన్వరీలాల్‌ శర్మ వర్ధంతిలో పాల్గొనడానికి వెళుతున్న సామాజిక కార్యకర్త మేథా పాట్కర్‌ను అలహాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించి ఆ ప్రాంతానికి వెళ్ళవద్దని అలహాబాద్‌ కలెక్టర్‌ ఇచ్చిన సూచనను ఆమె పాటించక పోవడంతో ఈ అరెస్టు తప్పనిసరైందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అలహాబాద్‌ యూనివర్శిటీ అతిధి గృహంలో ఆమెను నిర్భంధించినట్టు తెలిసింది. భూ సేకరణను అడ్డుకుంటున్నవారికి అండగా నిలబడేందుకు తనను విడుదల చేయాలని పాట్కర్‌ డిమాండు చేశారు.
First Published:  25 Sep 2015 3:08 PM GMT
Next Story